తెలంగాణలో రాబోయే బిజెపి ప్రభుత్వం అని రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ పేర్కొన్నారు.

Published: Thursday July 28, 2022


 

 

బీజేపీ కిసాన్ మోర్చా రాష్ట్ర కార్యవర్గ సమావేశం కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు కొండపల్లి శ్రీధర్ రెడ్డి అధ్యక్షత న బొంగుళూరు గేట్ పి ఎస్ జి కన్వెన్షన్ హాల్లో జరిగింది.

సమావేశం బీజేపీ కిసాన్ మోర్చా జాతీయ అధ్యక్షులు రాజ్ కుమార్ చాహార్ జ్యోతి ప్రజ్వలన తో ప్రారంభించి కిసాన్ మోర్చా శ్రేణులకు దిశా నిర్దేశం చేశారు.

నరేంద్ర మోదీ ప్రభుత్వం కేంద్రంలో రైతు సంక్షేమ పథకాలు అమలు చేస్తుంటే కేసీఆర్ తెలంగాణ లో వాటి అమలును అడ్డుకుంటున్నారని ఆరోపించారు.

ప్రధాన మంత్రి పసల్ బీమా పథకాన్ని రాష్ట్రంలో అమలు చేయకుండా రైతులకు కేసీఆర్ ద్రోహం చేస్తున్నాడని ఆయన ఆరోపించారు. కిసాన్ మోర్చా తెలంగాణ లో గ్రామ గ్రామానికి నరేంద్ర మోదీ ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు ప్రచారం చేయడం తో పాటు .కేసీఆర్ ప్రభుత్వం రైతు వ్యతిరేక విధానాలకు వ్యతిరేకంగా పోరాడాలని పిలుపు ఇచ్చారు.

 

అనంతరం కార్యవర్గ సమావేశం ముగింపు కార్యక్రమంలో ముక్య అతిథిగా బీజేపీ రాష్ట్ర శాఖ అధ్యక్షుడు బండి సంజయ్ పాల్గొని కిసాన్ మోర్చా చేపట్టిన కార్యక్రమాలు సమీక్ష అనంతరం ఆయన మాట్లాడుతూ

కేసీఆర్ మోసానికి కి బలి అయిన వారిలో రైతులు ముందు వరుసలో ఉన్నారన్నారు.

2018 లక్ష రూపాయల రుణ మాఫీ హామీ కేసీఆర్ ఎందుకు అమలు చేయలేదో చెప్పాలన్నారు.

కాళేశ్వరం ప్రాజెక్టు పేరుతో లక్ష కోట్ల ప్రజా ధనాన్ని దుర్వినియోగం చేసి క్లౌడ్ బరస్ట్ పేరుతో కేసీఆర్ నాటకాలు అడుతున్నడని .కిసాన్ మోర్చా రైతుల పక్షాన చేస్తున్న కృషిని మన పూర్వకంగా అభినందిస్తున్నానన్నారు. కేంద్ర ప్రభుత్వం డి ఏ పి యూరియా పై ఎకరాకు సుమారుగా 35000 // రూపాయల సబ్సిడీ ఇచ్చి రైతుకు వెన్ను దన్నుగా నిలిస్తే కేసీఆర్ ఇన్పుట్ సబ్సీడీ ఇవ్వకుండా రైతును దగా చేసాడన్నారు .కేసీఆర్ నాటకాలు ఇక ఎంతో కాలం సాగవన్నారు . కిసాన్ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు శ్రీధర్ రెడ్డి మాట్లాడుతూ లక్ష రూపాయల రుణ మాఫీ అమలుకు ప్రధాన మంత్రి పసల్ బీమా యోజన పథకాన్ని తెలంగాణ లో అమలు చేయాలని డిమాండ్ చేస్తూ కిసాన్ మోర్చా చేపట్టిన రైతు సంతక సేకరణ ఉద్యమం ఆగస్టు 7 వరకు తెలంగాణ వ్యాప్తంగా అన్ని గ్రామాల్లో నిర్వహిస్తామని అన్నారు

ఈ కార్యక్రమంలో భారతీయ జనతా పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి శ్రీ గుజ్జుల ప్రేమేందర్ రెడ్డి , కిసాన్ మోర్చ జాతీయ ఉపాధ్యక్షులు సురేష్ రెడ్డి , కిసాన్ మోర్చా జాతీయ కార్యవర్గ సభ్యులు గోలి మధుసూదన్ రెడ్డి , బసవ పాపయ్య గౌడ్ , కిసాన్ మోర్చా రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పడమటి జగన్మోహన్ రెడ్డి మరిపెళ్లి అంజయ్య యాదవ్ కిసాన్ మోర్చా ఉపాధ్యక్షులు భూనేటి కిరణ్ కుమార్ గౌడ్ తిరుపతి రెడ్డి సింగిడి కృష్ణారెడ్డి భారతీయ జనతా పార్టీ రంగారెడ్డి జిల్లా అధ్యక్షులు బొక్క నర్సింహా రెడ్డి కిసాన్ మోర్చా రాష్ట్ర పదాదికారులు, కిసాన్ మోర్చా జిల్లా అధ్యక్షులు రాష్ట్ర కార్యవర్గ సభ్యులు కిసాన్ మోర్చా రంగారెడ్డి జిల్లా అధ్యక్షుడు జక్క రవీందర్ రెడ్డి. రంగారెడ్డి జిల్లా సోషల్ మీడియా కన్వీనర్ ఉడుతల అశోక్ గౌడ్. కిసాన్ మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శులు తదితరులు పాల్గొన్నారు.