టీఆర్ఎస్ ఏల్ఫీ లో టీడీ ఏల్ఫీ విలీనం

Published: Friday April 09, 2021
మధిర, ఏప్రిల్ 8, ప్రజాపాలన ప్రతినిధి : మధిర టిడిపి నియోజకవర్గ కార్యాలయంలో పత్రికా విలేకరుల సమావేశంలో రామనాధం ఇంకా మాట్లాడుతూనిన్నబుధవారం నాడు ముఖ్యమంత్రి కేసీఆర్ స్వయంగా టిడిపి ఎమ్యెల్యే మెచ్చా నాగేశ్వరరావు గారికి ఫోను చేసి వారిని వెంటనే పార్టీమారాలని కోరినట్లు ప్రభాతవార్తకు ఎమ్యెల్యే నాగేశ్వరరావు గారు వెల్లడించిన విషయాన్ని కేసీఆర్ ఎలా సమర్థించు కొంటారు? పార్టీ ఫిరాయించిన ఆ ఇరువురు శాసన సభ్యులకు నిన్న దినపత్రికలలో వచ్చిన కథనాల ప్రకారం ప్రస్తుతం క్యాబినెట్ మంత్రి పదవులు ఆఫర్ చేయటం వారివారి సిట్టింగ్ స్థానాల్లో రాబోయే రాష్ట్ర జనరల్ ఎన్నికలలో టిఆర్ఎస్ టికెట్స్ ఇప్పుడే ఖాయం చేయటం వారిని ప్రలోభాలకు గురి చేసినట్లు రూఢీ ఐనట్లా కాదా? ఈముగ్గురు సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు నియోజకవర్గ ప్రజలకోసం, అభివుద్ధి కోసమే విలీనం అయ్యాం అని చెప్పటం బూటకం పైపెచ్చు సైకిల్ గుర్తులకు ఓట్లు వేసిన నియోజకవర్గ ఓటర్ మహాశయులే మమ్ములను టిఆర్ఎస్ లో చేరమన్నారని నమ్మ బలకటం తెలుగుదేశానికి చేసిన ద్రోహాన్ని కప్పిపుచ్చుకునేందుకే అని అన్నారు కాన ఎమ్యెల్యే పదవులకు తక్షణమే రాజీనామాలు చేయాలని డిమాండ్ చేశారు కేసీఆర్ ఈ తప్పుడు పనులు మాను కొనకపోతే బెడిసి కొట్టి రాబోయే రోజులలో టిఆర్ఎస్ పతనానికి దారితీస్తోంది అని హెచ్చరించారు ప్రజాస్వామ్యం ఉండాలి ప్రతిపక్షాలు ఉండాలని కేసీఆర్ ఎంత తొందరగా తెలుసుకుంటే అంత మంచిది అని అన్నారు కేంద్రం చేతిలో చావు దెబ్బలు తినే రోజు త్వరలోనే వస్తుంది అప్పుడు ప్రతిపక్షాల విలువ అర్ధమవుతుందని తెలియ జేశారు తెలుగువారికి  తెలుగుదేశాన్ని ఎలా కాపాడుకోవాలో తెలుసునని కార్యకర్తల పార్టీ అని వారే కాపాడతారని తెలుగుదేశానికి ఢోకా లేదని స్పష్టం చేశారు రామనాధం ఈ కార్యక్రమంలో లో మల్లాది హనుమంతరావు పుల్లారావు రామనాథం కాశి రావు వంకాయలపాటి వెంకట నాగేశ్వరరావు మేడ వెంకటేశ్వరరావు వెంకటేశ్వర రావు ఆనందరావు సుందర్ రావు తదితరులు పాల్గొన్నారు