*కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ పథకాలు పేదింటి ఆడబిడ్డల కుటుంబంలో వెలుగులు* -లబ్ధిదారులకు చెక్

Published: Wednesday January 25, 2023

చేవెళ్ల జనవరి 24, (ప్రజపాలన ):-

రాష్ట్ర ప్రభుత్వం పేదింటి ఆడబిడ్డల కుటుంబాల్లో వెలుగులు నింపాలనే సంకల్పంతో కల్యాణలక్ష్మి, షాదీముబారక్ పథకాలను ప్రవేశపెట్టారని చేవెళ్ల శాసనసభ్యులు కాలే యాదయ్య తెలిపారు.చేవెళ్ల మండల కేంద్రంలోని ఎమ్మెల్యే క్యాంప్ కార్యాలయంలో మంగళవారం ఏర్పాటు చేసిన చెక్కుల పంపిణీ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఎమ్మెల్యే కాలే యాదయ్య హాజరయ్యారు.మండలానికి చెందిన 41మంది కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లబ్ధిదారులకు 46 కళ్యాణ లక్ష్మి చెక్కులు,షాది ముబారక్ 4 చెక్కులు, సీఎంఆర్ఎఫ్ 11 చెక్కులు,52,26000 లక్షల విలువగల చెక్కులను ఆయన పంపిణీ చేశారు.ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ… రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పలు పథకాలు పేద ప్రజలకు ఎంతో ఆసరాగా నిలుస్తుందన్నారు. పేదల సంక్షేమానికి ప్రభుత్వం అనేక సంక్షేమ కార్యక్రమాలు అమలు చేస్తుందని పేర్కొన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ సహాయంతో ఎంతో మంది పేద కుటుంబాలకు పెండ్లిల భారం తగ్గిందని తెలిపారు. ఆడపిల్లల తల్లిదండ్రులు ఆర్థికంగా ఇబ్బంది పడవద్దు అనే ఉద్దేశంతో సీఎం కేసీఆర్ కల్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ ప‌థ‌కాల‌ను ప్రవేశపెట్టారని అన్నారు.సీఎం కేసీఆర్ అభివృద్ధి, సంక్షేమ పథకాలను ప్రవేశపెడుతూ దేశానికే మార్గదర్శిగా మారారని కొనియాడారు. పేదల సంక్షేమం కోసం రాష్ట్ర ప్రభుత్వం అనేక ప్రజా సంక్షేమ కార్యక్రమాలను అమలు చేస్తున్నదని స్పష్టం చేశారు.ఈ కళ్యాణ లక్ష్మి, షాది ముబారక్ డబ్బులను వృధా చేయకుండా అవసరానికి వినియోగించుకోవాలని ఈ సందర్భంగా ఎమ్మెల్యే కాలే యాదయ్య కోరారు. ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి, ఎమ్మార్వో వెంకటేశ్వర్లు,వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు మర్పల్లీ కృష్ణా రెడ్డి, చేవెళ్ల మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్, ఇంద్రన్న యువసేన అధ్యక్షులు రవికాంత్ రెడ్డి, రాములు, మార్కెట్ కమిటీ డైరెక్టర్ ఫయాజుద్దీన్, నాయకులు అబ్దుల్ ఘని, గడ్డమీది శేఖర్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు వివిధ గ్రామాల ప్రజలు టిఆర్ఎస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.