కెవిపిఎస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతిరావు పూల 195 జయంతి

Published: Tuesday April 12, 2022
ఇబ్రహీంపట్నం ఏప్రిల్ 11 ప్రజాపాలన ప్రతినిధి : ఇబ్రహీంపట్నం మండల కేద్రంలోని కామ్రేడ్ పాషా, నరహరి స్మారక కేంద్రంలో కులవివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఇబ్రహీంపట్నం మండల కమిటీ కెవిపిఎస్ ఆధ్వర్యంలో మహాత్మ జ్యోతి రావు పూలే జయంతి సందర్భంగా ఆయన చిత్ర పటానికి పూలమాలవేసి  నివాళులు అర్పించడం జరిగింది. ఈ సందర్బంగా ముఖ్య అతిధులుగా కెవిపిఎస్ జిల్లా కార్యదర్శి బి.సామెల్  పాల్గొని మాట్లాడుతూ. 150 సంవత్సరాల క్రితమే జ్యోతిరావు పూలే కుల వివక్ష కు అంటరాని తనానికి శ్రీ విద్య గురించి వితంతు పునర్ వివాహం గురించి పోరాడి సమాజాన్ని మార్చడానికి తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప మహనీయుడు అని గొప్ప దార్శనికుడు అన్నారు మహాత్మ జ్యోతిరావు పూలే తాను చదువుకునే రోజులలో ఒక బ్రాహ్మణ స్నేహితుని వివాహ వేడుకలకు హాజరు అవుతాడు ఆ వేడుకలకు హాజరైన టువంటి జ్యోతిబా పూలే కుల వివక్షకు గురి అవుతాడు అప్పుడే ఆయన నిర్ణయించుకుంటాడు ఈ సమాజంలో బ్రాహ్మణుల ఆధిపత్యం ఎక్కువ ఉందని దళితులు గిరిజనులు వెనుకబడిన తరగతులు అనేక వివక్షలకు గురి అవుతున్నారని దాన్ని నిర్మూలించాలంటే ఈ సమాజంలో కుల నిర్మూలన జరగాలని గట్టిగా నమ్మాడు అదేవిధంగా స్త్రీ లకు విద్య అనేది లేకుండా వంట ఇంటికే పరిమితమైన రోజులలో స్త్రీ విద్య కోసం అనేక ఉద్యమాలు నిర్వహించిన గొప్ప వ్యక్తి అని అన్నారు. అదే కాకుండా వితంతువులకు పునర్ వివాహ గురించి నాటి బ్రాహ్మణులను వ్యతిరేకించిన ఏకైక వ్యక్తి  జ్యోతి బా పూలే అని అన్నారు. ఇదే కాకుండా ఆయన సమాజ అభివృద్ధి కోసం సమసమాజ స్థాపన కోసం తన జీవితాన్ని త్యాగం చేసిన గొప్ప వ్యక్తి అని అన్నారు. కానీ కానీ నేటి మన పాలకులు ప్రజలను కులాలతో మతాలతో విభజించి రాజకీయ లబ్ది పొందడం కోసం ఎంతకైనా తెగిస్తున్నారు అని ఆ మహానుభావులు త్యాగాలకు విలువలు లేకుండా చేస్తున్నారని అన్నారు. కాబట్టి  చదువుకున్న టువంటి విద్యావంతులు మేధావులు అందరూ ఆలోచించి ఆయన ఆశయ సాధన కోసం ఆయన కోరుకున్న సమసమాజ స్థాపన కోసం కృషి చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో వ్య, కా, స, రైతు సంఘాల జిల్లా నాయకులు చేతల జంగయ్య, ఏ.వెంకటేష్, కెవిపిఎస్ మండల అధ్యక్ష కార్యదర్శులు జ్యోతి బాసు, యం. ఆనంద్, ఆశీర్వాదం, వీరేశం, యాదగిరి బుగ్గరాములు, గిరి, నర్సింహా, రమేష్, నర్సింహా, చరణ్, శ్రీను తదితరులు పాల్గొన్నారు.