మున్సిపల్ కార్మికులకు అధికారులు ఖర్చులు భరించాలి

Published: Thursday February 17, 2022
ఇబ్రహీంపట్నం ఫిబ్రవరి 16 ప్రజాపాలన ప్రతినిధి : మున్సిపల్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా రోడ్డు ప్రమాదంలో యాక్సిడెంట్ కు గురై తీవ్ర గాయాలై ఓమ్ని హాస్పిటల్ లో చికిత్స పొందుతున్న ఇబ్రహీంపట్నం నియోజకవర్గం తుర్కయంజాల్ మున్సిపల్ పారిశుద్ధ్య కార్మికురాలు మెతరి అనిత కు పాలకవర్గమే పూర్తి స్థాయిలో ఖర్చులు భరించాలని, అంతే కాకుండా కార్మికులకు భద్రతతో పాటు మున్సిపల్ అధికారులు, రాజకీయ నాయకుల వేధింపులను అరికట్టాలని డిమాండ్ చేస్తూ మున్సిపల్ వర్కర్స్ యూనియన్ (సిఐటియు) ఆధ్వర్యంలో ఈ రోజు తుర్కయంజాల్ మున్సిపల్ కార్మికులు తమ విధులను బహిష్కరించి మున్సిపల్ కార్యాలయం మరియు ఆయా వార్డ్ కార్యాలయాల్లో ధర్నాలు చేయడం జరిగింది... ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు మరియు తెలంగాణ మున్సిపల్ వర్కర్స్ అండ్ ఎంప్లాయిస్ యూనియన్ రంగారెడ్డి జిల్లా కార్యదర్శి డి.కిషన్ మరియు స్థానిక కౌన్సిలర్లు ఇతర రాజకీయ, సామాజిక నాయకులు స్థానిక యువకులు, ప్రజలు మద్దతు తెలిపి సంఘీభావం ప్రకటించారు.