బ్యాంకు సేవలపై విద్యార్థులకు అవగాహన కల్పించిన మహేష్

Published: Tuesday January 03, 2023
జన్నారం, జనవరి 2, ప్రజాపాలన: మండలంలోని వివేకానంద ఇంజన్ పల్లి పాఠశాలలో బ్యాంకు డిజిటల్ సేవాలపై అవగాహన కల్పించడం జరిగిందని సోమవారం తెలంగాణ గ్రామీణ బ్యాంకు ఇంధన్ పల్లి, కలమడుగు బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ మహేష్ అన్నారు. ఈ సందర్భంగా మండలంలోని ఇంధన్ పల్లి కలమడుగు గ్రామలలో ఎర్పాటు చేసిన వివేకానంద పాఠశాల విద్యార్థులతో బ్యాంకుపై అవగాహన సదస్సులో అయన మాట్లాడారు.  ఈ సందర్భంగా మాట్లాడుతూ డిజిటల్ సేవాల ఉపయోగం వల్ల అతి తక్కువ పెట్టుబడి వృద్ధాప్యంలో అత్యధిక ప్రయోజనాలు బ్యాంకులలో పొదుపు చేసుకునే 18 సంవత్సరాల నుంచి 40 సంవత్సరాల గల బ్యాంకు ఖాతాదారులకు 42, 210, 1000, 5,000 బ్యాంకులలో పొదుపు చేసుకుంటే జీవితాంతం నెలవారి పెన్షన్ లభిస్తుందన్నారు. 60 సంవత్సరాల వయసు నుంచి మీరు మీ జీవిత భాగస్వామి ప్రతినెల విశిష్టమైన పెన్షన్ పొందగలరు అన్నారు. జీవిత భాగస్వామి తరువాత మీ కుటుంబ ఒక లక్ష నుంచి 8 50 వేలు వరకు బీమా పొందగలరు. ప్రధానమంత్రి సురక్ష బీమా యోజన వార్షిక బీమా ప్రీమియం కేవలం 12 రూపాయలకు రెండు లక్షల రూపాయల ప్రమాద బీమా వర్తిస్తుందన్నారు. మరియు ప్రమాదాలు ఎప్పుడు ఎలా జరుగుతాయో తెలియదు కాబట్టి, ఎలాంటి పరిస్థితులు సంభవించిన వాటిని ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉండాలని అందుకే జీవిత బీమా, ఆరోగ్య బీమా తో పాటు యాక్సిడెంటల్, ఇన్సూరెన్స్ పాలసీ కూడా తీసుకుంటే ఉత్తమన్నారు. ప్రీమియం సొమ్ము ఖాతాదారుల పొదుపు ఖాతా నుంచి బ్యాంకు ద్వారా ఆటో డెబిట్ సదుపాయం కలదు, వార్షిక ప్రీమియం కేవలం 330 రూపాయలకు రెండు లక్షల బీమా లభిస్తుందన్నారు. ఎంత త్వరగా పొదుపు చేయడం ప్రారంభిస్తే అంత ఎక్కువ లాభం అన్నారు. ఏ వ్యక్తి అయినా కేవలం ఒక పొడుపు కథ మాత్రమే ఈ పథకాన్ని పొందగలరన్నారు. బ్యాంకు కు డైరెక్ట్ రావలసిన అవసరం వుండదు, ఎక్కడ నుండియైన లావాదేవీలు జరుపుకోవచ్తు సమయమ వృదాకాదని తెలిపారు. అన్ లైన్ సంబంధించి మెాసాలు ఎర్పడినప్పుడు బ్యాంకు సిబ్బందిని నేరుగా కలసి మీ సమస్యలను నిరువృత్తం చేసుకోవాలి. అన్ లైన్ లో ఓటిపి నెంబర్ ఇవ్వడం గాని ఖాతాదారులను ఇటువంటివి ఏమి చేయవద్దని, బ్యాంకు అధికారులు ఎప్పుడు కూడా ఖాతాకు సంబంధించినవి వివరాలను పోన్ లలో అడుగరు. అన్ లైన్ సేవాలు వినియోగించడంలో జాగ్రత్తలు తీసుకోవాలన్నారు.  కళాజాతి బృందం పాటలు మ్యాజిక్ షోలు నిర్వహించి బ్యాంకుల సేవలను ఇన్సూరెన్స్ రుణాలు సేవింగ్ వివిధ స్కీములు గురించి వివరించారు. ఈ కార్యాక్రమంలో తెలంగాణా  గ్రామీణ బ్యాంకు ఇంధన్ పల్లి బ్యాంకు ఫీల్డ్ ఆఫీసర్ మహేష్ కలమడుగు క్యాషియర్ సృజన్ సిబ్బంది శ్రీకాంత్ సత్తన్న కళాజాతి బృందం విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు.