ప్రమాదాల నియంత్రణలో ప్రతి ఒక్కరు సహకరించాలి

Published: Monday November 08, 2021
మధిర నవంబర్ 7 ప్రజాపాలన ప్రతినిధి : మధిర మున్సిపాలిటీ పరిధిలోని డివైడర్లను ఏర్పాటు చేసిన కూడా అనేక ప్రమాదాలు చోటు చేసుకొని అవయవాలు కోల్పోయిన వారు ఎందరో ఉన్నారు. కొన్ని సందర్భాల్లో ప్రాణాలు కోల్పోయిన పరిస్థితులు ఎన్నో మధిర మున్సిపాలిటీలు ఉన్నాయి. దీనిపై అధికారులు ఎటువంటి చర్యలు చేపట్టలేదు, ప్రమాద హెచ్చరిక బోర్డులు గాని, స్పీడ్ లిమిట్ గాని, రోడ్ టర్నింగ్ సూచించే సూచికలు గాని ఎక్కడ కూడా ఏర్పాటు చేయలేదు. దీనివల్ల వాహనదారులు కూడా వాళ్లకి ఇష్టమొచ్చినట్లు వాహనాలు నడపడం వల్ల ప్రమాదాల బారిన పడుతున్నారు. ముఖ్యంగా రైల్వే ఫ్లైఓవర్ రెండు అంచుల లో గల కాంగ్రెస్ ఆఫీస్, వైఎస్సార్ సెంటర్లో వాహనదారులు గజిబిజి గందరగోళం లో పడుతున్నారు. ఇంకా  ముఖ్యంగా ప్రమాద అంచుల్లో ప్రయాణమైనా  ఆత్కూరు రింగ్ రోడ్ నుండి వైఎస్సార్ శౌరస్త  అక్కడ అనేక ప్రమాదాలు తో ప్రాణాలు కోల్పోయిన  యువకులు చాలామంది,తల్లిదండ్రుల ఆర్తనాదాలు ఇంకా వినిపిస్తూనే ఉన్నాయి ముందుగా రోడ్డుపై ప్రమాదకరంగా మారిన గుంతలను మరమ్మతులు చేపట్టాలి దాని వల్ల ప్రమాదాలు నివారించే అవకాశాలు ఎక్కువ. ఈ ప్రమాదాల నివారణకు సంబంధిత శాఖల వారు చర్యలు తీసుకోవాలి. అలాగే రెడ్డి గార్డెన్ ప్రస్తుత కాలంలో ఎక్కువ ప్రమాదాలు జరిగే ప్రదేశంగా మధిర  ప్రజలు చెప్పుకుంటున్నారు..... ప్రమాద నియంత్రణలో తమ వంతు బాధ్యతగా దాతలైన మేళం శ్రీనివాస్ యాదవ్, హెచ్.పీ గ్యాస్ యజమాని కళ్యాణి అందించిన ప్రమాద హెచ్చరికడబ్బాలు కూడా ఆయా ప్రాంతాల్లో లేకపోవడం, హెచ్చరిక బోర్డు లేక రాత్రి వేళలో ప్రమాదాలకు కారణం అవుతున్నాయి. ఈ ప్రమాదాల నియంత్రణలో భాగంగా అనేక సేవా కార్యక్రమాలు నిర్వహించే అసోసియేషన్లు, స్వచ్ఛంద సంస్థలు స్పందించి హెచ్చరిక బోర్డులను ఏర్పాటు చేసి, అలానే రోడ్డుపై  ఉండే లోతైన గుంటలకు కూడా మరమ్మతులు నిర్వాహణకు సహకరించి ప్రమాదాల నియంత్రణలో భాగస్వాములు అవ్వాలని మధిర మున్సిపాలిటీ ప్రజలు కోరుతున్నారు.. వాహనదారులు పోలీసువారి హెచ్చరికలు పాటిస్తూ హెల్మెట్ ధరించడం, తాగివాహనం నడపకుండా ఉండడం, స్పీడ్ డ్రైవింగ్ చెయ్యకుండా ట్రాఫిక్ నియమాలు పాటించి ప్రమాదాల బారిన పడకుండా వారు వంతు బాధ్యత తో వారు వారితో పాటు వారి కుటుంబ సభ్యులను కూడా దృష్టిలో పెట్టుకొని వాహనాలను రోడ్డుపై నడపాలని కోరుకుంటూ..