ముష్టికుంట గ్రామంలో టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జడ్పీ చైర్మన్ ఆధ్వర్యంలో పార్టీ కండవాల

Published: Saturday November 26, 2022
బోనకల్, నవంబర్ 26 ప్రజాపాలన ప్రతినిధి: మండల పరిధిలోని ముష్టికుంట గ్రామంలో కాంగ్రెస్ పార్టీ సహా పలు పార్టీల నుండి టిఆర్ఎస్ పార్టీలో భారీ చేరికలు జరిగాయి. గురువారం నాడు సాయంత్రం గ్రామంలోని ఎస్సీ కాలనీ నందు జరిగిన కార్యక్రమంలో జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు వారికి గులాబీ పార్టీ కండువాలు కప్పి పార్టీలోకి ఆహ్వానించారు.ఈ సందర్భంగా జడ్పీ చైర్మన్ లింగాల కమల్ రాజు మాట్లాడుతూ కేసీఆర్ పాలనలో రాజకీయాలకు అతీతంగా సంక్షేమ పథకాల రైతు బంధు, రైతు బీమా, దళిత బంధు, కళ్యాణ లక్ష్మీ లాంటి పథకాలు అమలు చేస్తున్న ఏకైక సీఎం కెసిఆర్ అని,అభివృద్ధి, సంక్షేమం లో దేశానికే తెలంగాణ రాష్ట్రాన్ని ఆదర్శంగా నిలిపిన నాయకుడని,
గ్రామాల్లో పారిశుద్ధ్య పనులకు ట్రాక్టర్లు, ట్యాంకర్ లు ఇవ్వడం , డంపింగ్ యార్డులు, వైకుంఠ దామాల ఏర్పాటు కేసీఆర్ కే సాధ్యం అయ్యాయని వారు అన్నారు.
 చింతకాని మండలంలో రాజకీయాలకు అతీతంగా అన్ని దళిత కుటుంబాలకు దళిత బంధు అందించామనీ, నియోజకవర్గంలో ప్రస్తుతం దళిత బంధు ను ఎమ్మెల్యే భట్టి రాజకీయం చేస్తున్నాడని ఆయన మండిపడ్డారు.
 మూడు సార్లు ఎమ్మెల్యే గా మధిర కు భట్టి చేసింది శూన్యం అని,వచ్చే ఎన్నికల్లో మధిర లో గులాబీ జెండా ఎగరవేస్తా మనీ ఈ సందర్భంగా తెలియజేశారు.
  వచ్చే ఎన్నికల్లో తెలంగాణలో అధికారం మళ్ళీ టిఆర్ఎస్ దే నని, మధిర లో కూడా టిఆర్ఎస్ అభ్యర్థి గెలుపుతోనే అభివృద్ధి సాధ్యం అవుతుందని ఆయన అన్నారు.
 జడ్పీ చైర్మన్ గా మధిర అభివృద్ధి కోసం శాయశక్తులా పని చేస్తున్నానని,కోట్ల రూపాయల తో నియోజకవర్గంలో పలు అభివృద్ధి కార్యక్రమాలు జరిగాయని,త్వరలోనే సొంత స్థలాల్లో ఇళ్ల నిర్మాణం కార్యరూపం లోకి వస్తుందని తెలియజేశారు.సంక్షేమ పథకాలు ఆశ చూపి పార్టీలోకి రావాలని ఏ రోజు ఎవరిని అడగలేదని,డిప్యూటీ స్పీకర్ గా ఉన్నప్పుడు భట్టి చేసిన అహంకార రాజకీయాలు మేము అధికారంలో ఉన్న చేయడం లేదని,కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు దళిత బంధు, కళ్యాణ లక్ష్మీ, రైతు బంధు, రైతు బీమా భట్టి ఎందుకు ఇవ్వలేకపోయారని ఆయన విమర్శించారు. ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ ముఖ్య నాయకులు, ప్రజా ప్రతినిధులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.