బిజెపి కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా కొటాలగూడ పలుగుట్ట శ్రీనివాస్ ఎన్నిక

Published: Friday October 08, 2021
జిల్లా బిజెపి అధ్యక్షులు తొడిగల సదానంద్ రెడ్డి
వికారాబాద్ బ్యూరో 07 అక్టోబర్ ప్రజాపాలన : బిజెపి కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షులుగా చెందిన పలుగుట్ట శ్రీనివాస్ ను నియమించామని బిజెపి జిల్లా అధ్యక్షుడు తొడిగల సదానంద్ రెడ్డి అన్నారు. గురువారం జిల్లా కేంద్రంలోని బిజెపి జిల్లా అధ్యక్షుని స్వగృహంలో బిజెపి కిసాన్ సెల్ జిల్లా ఉపాధ్యక్షునిగా కొటాలగూడ గ్రామానికి చెందిన పలుగుట్ట శ్రీనివాస్ ను బిజెపి కిసాన్ సెల్ జిల్లా అధ్యక్షుడు మహిపాల్ రెడ్డి, బిజెపి జిల్లా ఉపాధ్యక్షుడు కరంతోడ్ రాఘవన్ నాయక్ ల ఆధ్వర్యంలో నియామక పత్రం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా బిజెపి అధ్యక్షుడు మాట్లాడుతూ.. పార్టీని పటిష్ఠపరిచేందుకు అహర్నిశలు కృషి చేయాలని హితవు పలికారు. బిజెపి తలపెట్టిన ప్రతి కార్యక్రమాన్ని విజయవంతం చేయుటకు పని చేయాలని సూచించారు. బిజెపి కిసాన్ సెల్ జిల్లా నూతన ఉపాధ్యక్షులు మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోడీ ఆధ్వర్యంలో ప్రవేశపెట్టిన ప్రతి సంక్షేమ పథకాన్ని గడపగడపకు చేరుస్తామని భరోసా ఇచ్చారు. కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెడుతున్న ప్రజోపయోగ పథకాలు దీర్ఘకాలంగా ఉపయోగపడుతాయని స్పష్టం చేశారు. దేశాన్ని రక్షించడమే కాకుండా అవినీతి మరక లేని ప్రభుత్వం అని కొనియాడారు. రాష్ట్ర బిజెపి అధ్యక్షుడు బండి సంజయ్ ప్రజా సంగ్రామ యాత్రను సంపూర్ణ విజయవంతం అయ్యేందుకు నా వంతు సహకారం అందజేస్తాను అన్నారు. రైతు సంఘాలను పార్టీ వైపు మొగ్గు చూపేలా కృషి చేస్తానని వివరించారు. నాకు బిజెపి కిసాన్ సెల్ ఉపాధ్యక్షుని పదవి ఇచ్చేందుకు కృషి చేసిన వారందరికి కృతజ్ఞతాభివందనాలు తెలిపారు. మాజీ మంత్రి డాక్టర్ ఏ చంద్రశేఖర్ కు, జిల్లా అధ్యక్షులు తొడిగల సదానంద్ రెడ్డికి, జిల్లా ఉపాధ్యక్షులు కరంతోడ్ రాఘవన్ నాయక్ కు కృతజ్ఞతలు తెలిపారు.