గోవేన గ్రామ సమస్యలు పరిష్కరించాలి

Published: Saturday June 26, 2021

జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి
ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి, జూన్ 25, ప్రజాపాలన : జిల్లాలోని గోవేన గ్రామపంచాయతీ పరిధిలో నెలకొన్న సమస్యలను పరిష్కరించాలని కోరుతూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే ఆత్రం సక్కు, శుక్రవారం ఆ గ్రామస్థులతో కలిసి జిల్లా కలెక్టర్ రాహుల్ రాజ్ కు వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే సమస్యల పరిష్కారం కొరకు జిల్లా కలెక్టర్ తో సమావేశం లో విన్నవించారు. గోవేన గ్రామపంచాయతీ పరిధిలో 5 గ్రామాలు ఉన్నాయని, వీటికి సిసి రోడ్లు నిర్మించాలని, బలన్ పూర్ నుండి గోవేన వరకు, గోవేన నుండి రఘు పూర్ వరకు రోడ్డు సౌకర్యం కల్పించాలని, గ్రామపంచాయతీ పరిధిలోని గ్రామాలకు లింక్ రోడ్లు నిర్మించాలని, కొలాం గుడా, నాయకఫుడా, గ్రామాలకు విద్యుత్ సౌకర్యం ఏర్పాటు చేయాలని, డిఆర్, డి పో, ఏర్పాటు, పెన్షన్లు పంపిణీ కార్యక్రమం చేపట్టాలని, గోండ్ గూడలో పాఠశాల భవనం, గోవేనాలో గ్రామ పంచాయతీ భవనం మంజూరు చేయాలని, అంగన్వాడీ కేంద్రం మంజూరు చేయాలని, పంచాయతీ పరిధి లోని గ్రామాలకు  భగీరథ పథకం వర్తింపజేసి నీరు సరఫరా చేయాలని కోరారు. ఈ సమావేశంలో జిల్లా పంచాయతీ అధికారి శ్రీకాంత్, మండల పంచాయతీ అధికారి, కార్యదర్శి, గ్రామ సర్పంచ్, గ్రామస్తులు సంబంధిత శాఖల అధికారులు, తదితరులు పాల్గొన్నారు.