పెయింటర్ కార్మికునికి ఆర్థిక సహాయం

Published: Thursday July 07, 2022
మంచిర్యాల టౌన్, జూలై 06, ప్రజాపాలన : మంచిర్యాల జిల్లా తెలంగాణ పెయింటర్ కార్మిక సంఘం ఆధ్వర్యంలో ఆకాష్ అనే పెయింటర్ కార్మికునికి లివర్ చెడిపోవడం తో అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి ఆయనను ను పర్మచించిన మున్సిపల్ వైస్ చైర్మన్ ముఖేష్ గౌడ్ అనంతరం ఆర్థిక సహాయం చేశారు. ఈ కార్యక్రమంలో,స్థానిక కౌన్సిలర్ జెగ్గారి సంజీవ్, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు గోంగర్ల శంకర్, కాజా మియా,  పెయింటర్ సంఘం  అధ్యక్షులు నరెడ్ల  శ్రీనివాస్, తెలంగాణ పెయింటర్ కార్మిక సంఘం అధ్యక్షులు మంచర్ల సదానందం, ప్రధాన కార్యదర్శి ఎండి జమీల్, కోశాధికారి సునీల్,   ఎండి మజీద్, సభ్యులు పాషా బాయ్, శంకర్ ,సతీష్, కృష్ణ తదితరులు పాల్గొన్నారు.