నిరుద్యోగ సమస్యలపై పోరాడుతాం : డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి గోడిసెల కార్తీక్

Published: Thursday July 22, 2021

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి జూలై 21(ప్రజాపాలన): భారత ప్రజాతంత్ర యువజన సమాఖ్య (డివైఎఫ్ఐ) జిల్లా కార్యదర్శి గా జిల్లాలోని వాంకిడి మండలం ఖిరిడి గ్రామానికి చెందిన గొడిసెల కార్తీక్ ను ఈనెల 18వ జిల్లా కేంద్రంలోని మాతృశ్రీ డిగ్రీ కళాశాలలో జరిగిన జిల్లా మహాసభలో, డివైఎఫ్ఐ రాష్ట్ర అధ్యక్షుడు విప్లవ్ ఎన్నుకోవడం జరిగిందని ఆయన బుధవారం విలేకరులతో తెలిపారు. ఈ సందర్భంగా కార్తీక్ మాట్లాడుతూ గతంలో విద్యార్థి ఉద్యమంలో అనేక జిల్లాలలో పోరాటాలు నిర్వహించి విద్యారంగ సమస్యలపై పోరాటాలు చేశారని, ఇప్పుడు నిరుద్యోగ సమస్యలపై ఉద్యమించడానికి డివైఎఫ్ఐ సంఘంలో బాధ్యతలు స్వీకరించనని అన్నారు. నిరుద్యోగులకు టిఆర్ఎస్ ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని, రాష్ట్రంలో ఇటు జిల్లాలో అనేక సమస్యలు ఉన్నాయని, సమస్యలపై పోరాటాలు నిర్వహిస్తానని అన్నారు. జిల్లా కేంద్రంలో ఉన్న ప్రభుత్వ ఆస్పత్రిలో సరైన సౌకర్యాలు లేవని, ఖాళీగా ఉన్న పోస్టులు భర్తీ చేయాలని, అలాగే జిల్లాలో నెలకొని ఉన్న పలు సమస్యలపై నిలదీస్తానని అన్నారు.