మంగళవారం సెలవును అమలుచేయాలి

Published: Wednesday March 17, 2021
భద్రాద్రి కొత్తగూడెం, మార్చి16, ప్రజాపాలన ప్రతినిధి : సీఐటీయూ ఆదివారం చర్లలో వారంతపు సంత వున్నందున  షాపులలో పనిచేస్తున్న కార్మికులకు మంగళవారం వారంతపు సెలవును విధిగా అమలు చేయాలని సీఐటీయూ జిల్లా ఉపాధ్యక్షులు కె.బ్రహ్మాచారి డిమాండ్ చేశారు. విషమై చర్ల వర్తక సంఘంవారికి రెండువారలక్రితమే సీఐటీయూ లేఖఇచ్చిందని గుర్తుచేశారు.కార్మికుల విజ్ఞప్తిమేరకు మంగళవారం సెలవును అమలు చేయుటకు వర్తకసంఘం నిర్ణయించినప్పటికి కొద్దిమంది వ్యాపారులు షాపులు తెరచి వుంచటంతో. సీఐటీయూ ఆద్వర్యంలో కార్మికులు ర్యాలిగా వెళ్ళి షాపు యజమానులతో మాట్లాడి షాపులు మూయించారు.మంగళవారం సెలవు ను అమలు చేస్తమని యజమానుకుడా అంగీక రించారు.వర్తకసంఘంవారికి తెలియజేసిన కార్నికుల సమస్యలను కూడా పరిష్కారం చేయాలని సీఐటీయూ కోరింది. కార్మిక హక్కులు కాలరాస్తున్న ప్రభుత్వ విధానాలపైన కార్నికులు పోరాడాలని సీఐటీయూ పిలుపునిచ్చింది. కార్మికులంతా ఐక్యంగా వుండి సమస్యలపై పోరాడాలని సీఐటీయూ తెలిపింది. ఈకార్యక్రమంలో సీఐటీయూ, షాపు వర్కర్స్ యూనియన్ నాయకులు బందల చంటి.పిల్లి రమేష్, వెంకటేశ్వర్లు, ప్రకాష్, ప్రతాప్, ఆది, వీరరాజుహర్ష, సతీస్, సుధాకర్, రంగారావు, గణేష్, సుార్యం తదితరులు పాల్గొన్నారు...