పుష్ప సినిమా రిలీజ్ తో ధియేటర్ ల వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ సంబరాలు

Published: Saturday December 18, 2021
మేడిపల్లి, డిసెంబర్ 17 (ప్రజాపాలన ప్రతినిధి) : పుష్ప సినిమా రిలీజ్ తో హైదరాబాద్ అంబర్‌పేట్ శ్రీ రమణ సినిమా థియేటర్ వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ రాష్ట్ర అధ్యక్షుడు గడ్డం రవికుమార్ ఆధ్వర్యంలో ఫ్యాన్స్ బాణసంచా పేలుస్తూ సంబరాలు జరుపుకున్నారు. అల్లు అర్జున్ పుష్ప సినిమా థియేటర్ లో రిలీజ్ కావడంతో థియేటర్ల వద్ద అల్లు అర్జున్ ఫ్యాన్స్ తో కిటకిటలాడుతున్నాయి. ఇప్పటికే సినిమా పాటలు సూపర్ హిట్ కావడంతో సినిమాకు కూడా అదే స్థాయిలో సూపర్ హిట్ అవుతుందని గడ్డం రవి కుమార్ ఆశాభావం వ్యక్తం చేశారు. కరోనా కారణంగా రెండు సంవత్సరాలుగా సినిమా థియేటర్లో  చూడక ఎంతో నిరాశతో ఉన్న ప్రేక్షకులకు శుక్రవారం ఇంత పెద్ద సినిమా రిలీజ్ కావడం పండుగ వాతావరణాన్ని నెలకొందని గడ్డం రవి కుమార్ తెలిపారు. ఫ్యాన్స్ సంతోషానికి అవధులు లేకుండా పోయాయి. సినిమా అన్ని రికార్డులను బద్దలు కొడుతుందని గడ్డం రవికుమార్ ధీమా వ్యక్తం చేశారు. సినిమాకు 5 ఆటలు ప్రదర్శించడానికి ప్రభుత్వం అనుమతి ఇవ్వడంపై సంతోషం వ్యక్తం చేశారు. తెలంగాణ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ సంబరాల్లో కిట్టు, డి.జే సాయి, నందికంటి శివ, జే.సిద్ది రాములు, వంశీ తదితరులు  పాల్గొన్నారు.