జగిత్యాల జిల్లా జాతీయ సేవా పథకం నోడల్ అధికారిగా డాక్టర్:పడాల తిరుపతి నియామకం

Published: Monday September 26, 2022

రాయికల్, సెప్టెంబర్ 25 (ప్రజాపాలన ప్రతినిధి): రాయికల్ పట్టణానికి చెందిన ప్రొఫెసర్ డా:పడాల తిరుపతి సామాన్య రైతు కుటుంబంలో పుట్టి విద్యను అభ్యసిస్తూ ప్రభుత్వ ఉపాధ్యాయునిగా ఉద్యోగాన్ని సంపాదించాడు.  తద్వారా ఉన్నత ఉద్యోగాన్ని సాధించాలని దృడ సంకల్పంతో ఉన్నత విద్యను అభ్యసిస్తూనె జూనియర్ కళాశాల అధ్యాపకునిగా ఉద్యోగాన్ని సాధించి,అదే వరుసలో వృక్షశాస్త్రంలో డాక్టరేట్ (పి.హెచ్.డి) పట్టాను అందిపుచ్చుకున్నాడు. ప్రస్తుతం ఆయన జగిత్యాల జిల్లా కేంద్రంలో మహిళా డిగ్రీ కళాశాల వృక్షశాస్త్ర విభాగ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా బాధ్యతలు  నిర్వహిస్తున్న  డా: పడాల తిరుపతిని జగిత్యాల జిల్లా జాతీయ సేవా పథకం నోడల్  అధికారిగా నియమించినట్లు ఎన్ .ఎస్.ఎస్ కోఆర్డినేటర్ శాతవాహన యూనివర్సిటీ ప్రొఫెసర్  కోడూరి శ్రీ వాణి తెలిపారు.  విద్యార్థులలో ఎన్.ఎస్.ఎస్ వాలంటీర్లకు దేశభక్తిని ప్రబోధిస్తూ దేశంపట్ల,  జాతిపట్ల జాగృతం చేసే సేవా భావాన్ని పెంపొందించే  గొప్ప అవకాశమని కొనియాడుతూ,డా:పి. తిరుపతి నియామకం పట్ల రాయికల్ పట్టణ మేధావులు,ఉద్యోగులు మిత్రులు,పలువురు హర్షం వ్యక్తం చేశారు.