జిల్లా కలెక్టర్ గుగులోతు రవి ని కలిసిన నూతన జగిత్యాల తెలంగాణ గెజిటెడ్ అధికారులు

Published: Tuesday July 05, 2022

జగిత్యాల, జులై, 04 (ప్రజాపాలన ప్రతినిధి): జగిత్యాల జిల్లా కలెక్టర్ కార్యాలయంలో ఇటీవల నూతనముగా ఎన్నిక కాబడిన తెలంగాణ గెజిటెడ్ అధికారుల జగిత్యాల జిల్లా సంఘం సభ్యులు జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, అదనపు కలెక్టర్ లత మరియు అదనపు కలెక్టర్ లోకల్ బాడీస్ అరుణ శ్రీ ను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచం అందజేశారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ గుగులోతు రవి, అదనపు కలెక్టర్  గెజిటెడ్ ఉద్యోగుల సంఘ కార్యవర్గానికి శుభాకాంక్షలు తెలిపారు. గెజిటెడ్ అధికారులు అభివృద్ధి కార్యక్రమాలలో కీలక అధికారులని, క్షేత్ర స్థాయి బాగా పనిచేయాలని, సహకరించాలని కోరారు. ఈ కార్యక్రమంలో అధ్యక్షులు గంగుల సంతోష్ కుమార్, ప్రధాన కార్యదర్శి మామిడి రమేష్, అసోసియేటెడ్ అధ్యక్షులు కందుకూరి రవిబాబు, కోశాధికారి గణేష్, ఉపాధ్యక్షులు లావణ్య, డా.ఎన్. శ్రీనివాస్, సంయుక్త కార్యదర్శి సలీం. డా. ప్రవీణ్ చంద్ర, అర్గనిజింగ్ సెక్రటరీ  కిరణ్ కుమార్, ప్రవీణ్, పుల్లయ్య, మరియు కార్యవర్గ సభ్యులు డా. బద్దం రాజేందర్ రెడ్డి, సిజాయుద్దీన్, నాగార్జున, సుష్మ, విశ్వాన్, తిరుపతి నాయక్, గెజిటెడ్ అధికారులు పాల్గోన్నారు