జగిత్యాల జిల్లా ధర్మపురి నియోజకవర్గంలో కోవిడ్-19 స్వచ్ఛంద లాక్డౌన్

Published: Tuesday April 27, 2021
గొల్లపల్లి, ఏప్రిల్ 26 (ప్రజాపాలన ప్రతినిధి) : ​జగిత్యాల జిల్లాలోని ధర్మపురి నియోజకవర్గంలో గొల్లపల్లి, పెగడపల్లి, బుగ్గారం, వెల్గటూర్, ధర్మారం మండలాలతో పాటు గ్రామ పంచాయతీలు మరియు పురపాలక సంఘాల పాలకవర్గాలు స్వచ్ఛంద లాక్డౌన్ అమలు చేసేందుకు తీర్మానాలు చేశాయి. పల్లెల్లో కొవిడ్ -19 పాజిటివ్ కేసులు భారీగా పెరుగుతు న్నందున ముందస్తు చర్యలుగా లాక్డౌన్ విధానం పాటిస్తున్నారు. ​గ్రామాల్లో రద్దీగా ఉండే రోడ్లు నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. దుకాణాలు మధ్యాహ్నం వరకు కొన్ని గ్రామాల్లో ఉదయం 06 నుండి 09 గం వరకు సాయంత్రం 06 గం నుడి 08 గం వరకు కొన్ని తెరిచి ఉంచినప్పటికీ జన సంచారం అంతంత మాత్రం గానే ఉంది. అత్యవసరం అయితే మాస్కు తప్పక ధరించనిది ఎవరూ బయటకు రావడం లేదు. కొన్ని గ్రామాల్లో పదుల సంఖ్యలో పాజిటివ్ కేసులున్నాయి. ధర్మపురి లక్ష్మీనరసింహస్వామి ఇతర ప్రముఖ ఆలయా ల్లోకి వచ్చే భక్తుల సంఖ్య గణనీయంగా తగ్గింది