మధ్యాహ్నం భోజన వర్కర్లు సమస్యలను పరిష్కరించాలని ధర్నా

Published: Tuesday November 23, 2021
ఏనుకూరు ప్రజాపాలన ప్రతినిధి : ఖమ్మం జిల్లా ఎనుకురు మండల కేంద్రంలో మధ్యాహ్నం భోజన వర్కర్ల యూనియన్ అనుబంధం సిఐటియు ఆధ్వర్యంలో ఏనుకూరు సి ఐ టి యు ఆఫీస్ నుండి స్థానిక ఎం ఈ ఓ కార్యాలయం వరకు ర్యాలీగా వెళ్లి రెండు గంటలసేపు తమ సమస్యలు పరిష్కరించాలని పెండింగ్లో ఉన్న వేతనాలు ఇవ్వాలని ధర్నా నిర్వహించారు ఈ కార్యక్రమానికి ఏన్కూర్ సి ఐ టి యు మండల కార్యదర్శి ఏర్పుల రాములు అధ్యక్షత జరిగిన ఈ కార్యక్రమానికి మధ్యాహ్న భోజన వర్కర్ల యూనియన్ జిల్లా కార్యదర్శి సిహెచ్ కుమారి ముఖ్య అతిథిగా పాల్గొని మాట్లాడారు మధ్యాహ్న భోజన వర్కర్లు అనేక కష్టాలు పడుతున్నారని తెలంగాణ రాష్ట్రంలో వారిని గుర్తించిన నాధుడే లేకుండా పోయాడు అని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు బంగారు తెలంగాణలో వెయ్యి రూపాయల వేతనంతో వారు బతుకులీడుస్తున్నారు అని పనిచేస్తున్న వారంతా ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ లేనని అందువల్లనే ప్రభుత్వం దీన్ని గుర్తించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు బంగారు తెలంగాణలో ఇంత తక్కువ వేతనంతో పని చేసే వారు మీ యొక్క లే అని ప్రభుత్వం పిల్లలకు చేస్తున్నటువంటి మెనూ చార్జీలు 15 పైసలు 60 పైసలు 25 పైసలు పెంచుతాం అంటూ జీవోలు ఇస్తుంది తప్ప అవి కూడా పెంచడం లేదని పెంచిన బిల్లు ఇవ్వడం లేదని ఆమె అన్నారు 25 పైసలు 15 పైసలు చలామణిలో లేనప్పటికీ ప్రభుత్వానికి కళ్ళు కనిపించడం లేదని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు వెయ్యి రూపాయలకి ప్రభుత్వం చెప్పాలని ఆమె అన్నారు ఈ కార్యక్రమంలో సిఐటియు జిల్లా కమిటీ సభ్యురాలు రమ్య పాల్గొని మాట్లాడారు తెలంగాణ రాష్ట్రంలో కార్మికుల శ్రమ దోపిడీ ఇక్కడే జరుగుతుందని ఆమె అన్నారు బిల్లులు వేతనాలు పెండింగ్ లో ఉన్నటువంటి కోడి గుడ్డు పిల్లలు ఇచ్చేంతవరకు విధులు బహిష్కరించి ఈ ధర్నా నిర్వహిస్తామని ఆమె చెప్పారు అనంతరం ఎం ఈ ఓ కార్యాలయం నుండి తాసిల్దార్ కార్యాలయం వరకు వెళ్లి తహశీల్దార్ కి వినతి పత్రాన్ని అందజేశారు,