పోడు భూములకు శాశ్వత పరిష్కారం చూపాలి... ఎమ్మెల్యే ఆత్రం సక్కు కు వినతి...

Published: Thursday October 29, 2020

ఆసిఫాబాద్ జిల్లా ప్రతినిధి (ప్రజాపాలన): జిల్లాలో గత కొన్ని సంవత్సరాలుగా అటవి పైనే ఆధారపడి పోడు వ్యవసాయం చేస్తున్న గిరిజనుల అందరికీ పట్టాలు ఇచ్చి శాశ్వత పరిష్కారం చూపించాలని ఏపీ బి ఎస్ ఎస్ జిల్లా ప్రధాన కార్యదర్శి మధు అన్నారు. బుధవారం జిల్లా కేంద్రంలో ఎమ్మెల్యే ఆత్రం సక్కు ను కలిసి వినతి పత్రాన్ని అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ గిరిజనులు చేసుకుంటున్న పోడు భూములకు పట్టాలు లేకపోవడంతో రైతు బంధు లాంటి ప్రభుత్వ పథకాలను పొందలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. నూతన రెవెన్యూ చట్టం లో అటవీ భూముల సమస్య పరిష్కారంలో ముఖ్యమంత్రి ప్రత్యేక చొరవ చూపాలని కోరారు.