శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి అమ్మవారి దేవాలయము నందు శాకంబరీ దేవి అలంకరణ

Published: Saturday July 23, 2022
మధిర జూలై 22 ప్రజాపాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధిలో శుక్రవారం నాడుశ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయము నందు ఈ రోజున ఆషాడ మాస సందర్భంగా శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయం అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్రావు మరియు కమిటీ సభ్యులు వారి ఆధ్వర్యంలో పూజారి  శ్రీమాన్ శేషచార్యులు  శాకంబరీ దేవి అలంకరణ  ఘనంగా నిర్వహించారు.ఈ అలంకరణలో అన్ని రకముల కూరగాయలతో అమ్మవారిని అలంకరించారు ఈ కార్యక్రమంలో   దేవాలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు శ్రీ వాసవి కన్యకా పరమేశ్వరి దేవాలయ అధ్యక్షుడు కపిలవాయి జగన్మోహన్రావు మాట్లాడుతూ ఈ మూడు రోజులు మన దేవాలయంలో ఆషాడమాస సందర్భంగా ఉత్సవాలు జరుగును కావున భక్తులందరూ మన దేవాలయానికి వచ్చి అమ్మవారి సేవలో పాల్గొని తీర్థ ప్రసాదాలు స్వీకరించ గలరని కోరుచున్నాము ఈరోజు సాయంత్రం అయ్యప్ప స్వామి బృందం చే భజన కార్యక్రమము నిర్వహించబడును కావున భక్తులందరూ పాల్గొనవలసిందిగా విజ్ఞప్తి చేస్తున్నాము