అక్రమంగా తరలిస్తున్న రేషన్ బియ్యం పట్టివేత : ఎస్సై దేవం బోట్ల రాజు

Published: Thursday April 22, 2021

పరిగి, ఏప్రిల్ 21, ప్రజాపాలన ప్రతినిధి : పరిగి నియోజకవర్గం, అక్రమంగా రేషన్ బియ్యాన్ని తరలిస్తుండగా పట్టుబడిన సంఘటన దోమ మండల కేంద్రంలో బుధవారం చోటు చసుకుంది. స్టేషన్ హౌస్ అధికారి దేవంబోట్ల రాజు తెలిపిన వివరాల ప్రకారం మల్లెపల్లి గ్రామానికి చెందిన జోగు నర్సిములు తండ్రి అడివప్ప 13 క్వింటాళ్ల రేషన్ బియ్యాన్ని మల్లెపల్లి గ్రామం నుండి ముదేలికి అక్రమంగా టాటా ఏసీ వాహనంలో తరలిస్తుండగా సమాచారం తెలుసుకున్న ఏఎస్ఐ సంగమేశ్వర్  దాదాపూర్ గ్రామ సమీపంలో వాహనాన్ని పట్టుకున్నారు. ఎస్సై రాజు మాట్లాడుతూ ప్రభుత్వాలు కరోనా మహమ్మారి కట్టడి కాలంలో ప్రజలకు అన్నిరకాల నిబంధనలతో కూడిన  సౌకర్యాలు, సదుపాయాలలో భాగంగా రూపాయి కిలో బియ్యం ప్రతి కార్డు దారుకు అందిస్తుంది. అట్టి బియ్యాన్ని దళారీ దారులు ఇతర రాష్ట్రాలకు అక్రమంగా తరలించి సొమ్ము చేసుకుంటున్నారు.ప్రభుత్వ నియమ నిబంధనలు ఉల్లంగించిన ఎంతటి వారినైనా ఉపేక్షించేది లేదని దోమ ఎస్సై రాజు హెచ్చరించారు.వాహనం పై ఆదేవిధంగా జోగు నర్సిములుపై కేసు నమోదు చేయడం జరిగిందని ఎస్సై రాజు తెలిపారు.