గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించడమే లక్ష్యం

Published: Saturday July 02, 2022
 వికారాబాద్ మండల ఎంపిడిఓ సత్తయ్య
వికారాబాద్ బ్యూరో జూలై 01 ప్రజా పాలన : గ్రామీణ క్రీడాకారుల నైపుణ్యాన్ని గుర్తించి మెరుగులు దిద్దడమే లక్ష్యంగా తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాలను ఏర్పాటు చేయనున్నామని వికారాబాద్ మండల ఎంపీడీవో సత్తయ్య అన్నారు. శుక్రవారం వికారాబాద్ మండల పరిధిలోని గోదంగూడ జైదుపల్లి గ్రామాలలో గ్రామ సర్పంచులు అనితా సత్తయ్య గౌడ్ బుడిగే ఎల్లమ్మ లక్ష్మణ్ ల ఆధ్వర్యంలో తెలంగాణ గ్రామీణ క్రీడా ప్రాంగణాల స్థలాలను గుర్తించారు. ఈ సందర్భాన్ని పురస్కరించుకొని ఎంపీడీవో మాట్లాడుతూ గ్రామీణ యువతను శారీరకంగా మానసికంగా దృఢంగా తయారు చేయడమే లక్ష్యంగా కృషి చేస్తున్నామని పేర్కొన్నారు. కండ కలిగిన యువత దేశానికి రక్షణ కవచంగా ఉంటారని గుర్తు చేశారు. నేటి యువత శరీరానికి అవసరమగు దృఢత్వాన్ని కలిగించే ఆటలను ఆడ లేక బలహీనంగా తయారవుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు సెల్ ఫోన్లు టీవీలకు ఆకర్షితులై శారీరక దృఢత్వాన్ని కోల్పోతున్నారని విచారం వ్యక్తం చేశారు చదువుతోపాటు ఆటపాటల్లో విశేషంగా రాణించిన వారికి ప్రభుత్వ ఉద్యోగాలలో తగు గుర్తింపు ఉంటుందని గుర్తు చేశారు. భారతదేశ సంప్రదాయ క్రీడలైన కబట్టి ఖోఖో వాలీబాల్ వంటి ఆటలను ఆడేందుకు యువత ఆసక్తి చూపాలని ఆకాంక్షించారు.
 
 
 
Attachments area