ప్రభుత్వ భూమిని కాపాడాలని తహసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా

Published: Thursday June 10, 2021
వలిగొండ, జూన్ 09, ప్రజాపాలన ప్రతినిధి : ప్రభుత్వ భూమి సర్వేనెంబర్ 29 చుట్టూ ఉన్న సర్వే నెంబర్ 27, 28, 91, 37, 38 లలో సంపూర్ణంగా సర్వే నిర్వహించి ప్రభుత్వ భూమికి చుట్టు హద్దులు ఏర్పాటు చేయాలని కోరుతూ తాసిల్దార్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి అనంతరం తాసిల్దార్ నాగలక్ష్మికి బుధవారం వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు బీసీ సంఘం మండల అధ్యక్షులు సాయిని యాదగిరి, ఏకలవ్య సంగం మండల అధ్యక్షులు బొరుగుల యాదగిరి, ఎమ్మార్పీఎస్ నాయకులు రామచంద్రం, సిపిఎం పట్టణ కార్యదర్శి శ్రీనివాస్ లు మాట్లాడుతూ ప్రభుత్వ భూమి 12 ఎకరాల 24 గంటలు ఉండాల్సిన భూమిని మండల సర్వేయర్ శంకర్ అవినీతికి పాల్పడి భూమి తక్కువగా చూపించినట్లు ఆరోపించారు.ప్రభుత్వ సర్వే నెంబర్ చుట్టూ ఉన్న పక్క పట్టాదారులు సుమారు మూడు ఎకరాలు అక్రమంగా ఆక్రమించినట్లు ఆరోపించారు. పునర్ సర్వే నిర్వహించి ఆ భూమికి నాలుగు దిక్కుల సర్వే నిర్వహించి హద్దులు నాటాలని డిమాండ్ చేశారు. సర్వే నిర్వహించి వరకు చుట్టుపక్కల సాగును ఆపాలని వినతి పత్రంలో కోరారు.లేని ఎడల ప్రజలను సమీకరించి రిలే నిరాహార దీక్షలు ఆమరణ దీక్షలు చేపడతామని తెలిపారు. ఈ కార్యక్రమంలో అరుణ యాదమ్మ ఎక్కల దేవి ప్రమీల, గురువమ్మ, సరిత, మహాలక్ష్మి, విజయ, మంగమ్మ, అపర్ణ, యాదగిరి, ఇస్తారి, లక్ష్మణ్, 40 మంది పాల్గొన్నారు.