ఎంపీడీవో ను కలిసి వినతి పత్రం అందజేశారు ఉపాధి కూలీలకు బిల్లులు వెంటనే విడుదల చేయాలని సిపిఎం

Published: Thursday May 19, 2022

పెండింగ్ లో ఉన్న ఉపాధి కూలీల బిల్లులను వెంటనే విడుదల చేయాలని వ్యవసాయ కార్మిక సంఘం రాష్ట్ర కార్యదర్శి వెంకట్ రాములు, జిల్లా కార్యదర్శి కందుకూరి జగన్ డిమాండ్ చేశారు. బుధవారం ఇబ్రహీంపట్నం ఎంపీడీవో కార్యాలయం ముందు ఉపాధి కూలీల సమస్యలు పరిష్కరించాలని ధర్నా నిర్వహించి అనంతరం ఎంపీడీవో గారికి వినతి పత్రం అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఇబ్రహీంపట్నం మండలంలో 3852 మంది ఉపాధి పని చేస్తున్నారు. 6 వారాలు అయినా కూలీలకు డబ్బులు రాకపోవడంతో తీవ్ర ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వేసవికాలంలో  ఉపాధి హామీ పని చేస్తున్నన సరైన టైమ్ కు డబ్బులు రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మోడీ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఉపాధి హామీ పథకాన్ని విస్మరిస్తు 2021-22 బడ్జెట్లో ఉపాధి హామీ కి 73 వేల కోట్లు కేటాయిస్తే 2022-23 బడ్జెట్లో 50 వేలు నిధులు కేటాయించి 23 వేల కోట్లు నిధులు తగ్గించారని ఆవేదన వ్యక్తం చేశారు. ఉపాధి హామీ చట్టం లో కూలీలకు 40 రూపాయలు సమ్మర్ అలవెన్స్, 5 కిలోమీటర్ల దూరంలో పని చేస్తే ప్రయాణ ఛార్జీలు 20 రూపాయలు మరియు గడ్డపార డబ్బులు ఇవ్వడం లేదు. పని ప్రదేశంలో మెడికల్ కిట్లు లేవు ఎండ తీవ్రత తట్టుకోవడానికి టెంట్లు వంటి సౌకర్యాలు కల్పించాలి కానీ ఇవేవీ కల్పించకుండా కూలీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఉపాధిహామీ పనిదినాలు 200 రోజులు పెంచి దినసరి కూలీ 600 రూపాయలు ఇవ్వాలి. ఫీల్డ్ అసిస్టెంట్లను విధులోకి తీసుకోవాలని వారు ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.
ఈ కార్యక్రమంలో జిల్లా ఉపాధ్యక్షులు జంగయ్య, నాయకులు సామెల్,బుగ్గరాములు, లింగస్వామి, యాదగిరి, నర్సింహ, విజయమ్మ, స్కైలాబ్, ఉమా, లావణ్య, శ్రీనివాస్, బిక్షపతి, మరియు ఉపాధి కూలీలు పాల్గొన్నారు