పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజల సహకారం అవసరం ** జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పేయి ** పట్ట

Published: Tuesday August 23, 2022
ఆసిఫాబాద్ జిల్లా ఆగస్టు22 (ప్రజాపాలన, ప్రతినిధి) : పట్టణం పరిశుభ్రంగా ఉండాలంటే ప్రజలు తమకు సహకరించాలని చెత్తను రోడ్లపై కాకుండా చెత్త వాహనాల్లో వేయాలని జిల్లా అదనపు కలెక్టర్ చాహత్ బాజ్పేయి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని బాపు నగర్, రావుల వాడా, బజార్ వాడి, ప్రాంతాలలో ఉదయం కాలినడకన తిరుగుతూ రోడ్డుపై వేసిన చెత్తకు సంబంధించి ప్రజలకు అవగాహన కల్పిస్తూ చెత్త రోడ్ల పై వేయకూడదని సూచించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ పట్టణాన్ని పరిశుభ్రంగా ఉంచాల్సిన బాధ్యత అధికారులతో పాటు, ప్రజలపై ఉంటుందన్నారు. ప్రజల సహకారం లేకుంటే పట్టణ  అపరిశుభ్రత సాధ్యం కాదన్నారు. ప్రతి ఒక్కరూ చెత్త వాహనంలోనే చెత్త వేయాలన్నారు. చెత్త వాహనాలు ప్రతిరోజు వస్తాయని, ఎవరూ కూడా చెత్త రోడ్లపై వేయకూడదని తెలిపారు. ప్రతి నెల ఒక్కో ఇంటికి రూ 30 చెల్లించాలని సూచించారు. ఈ సందర్భంగా కాలనీలలో  ప్రజల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో పంచాయతీ సెక్రెటరీ వంశీకృష్ణ, రవి, సిబ్బంది పాల్గొన్నారు.
 
 
 
Attachments area