సెవెంత్ డే చర్చిని ప్రారంభించిన ఎమ్మెల్యే సండ్ర

Published: Saturday December 31, 2022

తల్లాడ, డిసెంబర్ 30 (ప్రజా పాలన న్యూస్): మండలంలోని బిల్లుపాడు గ్రామంలో శుక్రవారం నూతనంగా నిర్మించిన సెవెంత్ డే చర్చ్ ప్రారంభోత్సవంలో పాల్గొన్న సత్తుపల్లి శాసనసభ్యులు సండ్రా వెంకట వీరయ్య. అనంతరం ఎమ్మెల్యే మాట్లాడుతూ అందరికీ నూతన సంవత్సర సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ కార్యక్రమంలో డిసిఎంఎస్ చైర్మన్ రాయల వెంకట శేషగిరిరావు, ఎంపీపీ దొడ్డ శ్రీనివాసరావు, జడ్పిటిసి దిరిశాల ప్రమీల, వైరా వ్యవసాయ మార్కెట్ వైస్ చైర్మన్ ధూపాటి భద్రరాజు, రైతుబంధు మండల అధ్యక్షులు దుగ్గిదేవర వెంకటలాల్, టిఆర్ఎస్ పార్టీ జోనల్ చైర్మన్ దిరిశాల దాసు రావు,ఎంపీటీసీ రుద్రాక్ష బ్రహ్మం, టిఆర్ఎస్ పట్టణ అధ్యక్షులు జివిఆర్, ఆల్ ఇండియా చర్చి అధ్యక్షులు టి.వి రావు, బిల్లుపాడు టిఆర్ఎస్ అధ్యక్షులు ఇంజo కృష్ణార్జున రావు, వేమా శ్రీనివాసరావు, నల్లగట్ల నాగేష్, తడికమల్ల రవి, ఎలమర్తి కుటుంబరావు, రుద్రాక్ష బాబు, రుద్రాక్ష నరసింహ చారి, రుద్రాక్ష రామకృష్ణ చారి, సంఘ సెవెంత్ డే చర్చి పాస్టర్ కరుణాకర్ తదితరులు పాల్గొన్నారు..