ఆపన్నహస్తం కోసం ఎదురుచూపు

Published: Wednesday November 02, 2022
జన్నారం, నవంబర్ 01, ప్రజాపాలన: మంచిర్యాల జిల్లా జన్నారం మండలం పోన్కల్ గ్రామానికి చెందిన కోడిపెల్లి శ్రీనివాస్ (45) "వృత్తి " కూలి" పనిచేస్తూ జీవించేవారని, ఇటివల ఆరోగ్యం బాగా లేక వట శ్రీనివాస్ పరిస్థితి విషమంగా ఉంది. ప్రస్తుతం నిర్మల్ జిల్లా ఓ ప్రైవేటు ఆసుపత్రిలో చికిత్స పొందుతూ అపన్నహస్తం కోసం ఎదురుచూస్తూన్నారు. ఆసుపత్రి చికిత్స కోసం పోన్కల్ గ్రామ కమిటీ ఆధ్వర్యంలో కొంతవరకు ఆర్థిక సహాయం చేశామని స్థానిక గ్రామ అధ్యక్షుడు మర్రిపల్లి అంజయ్య తెలిపారు. చికిత్సకు ఎక్కువ డబ్బులు ఖర్చవుతుందని అసుపత్రి వైద్యులు తెలిపారన్నారు. డెలీకూలి పనిచేసి తన కుటుంబాన్ని పోషించుకునే వారన్నారు. చికిత్స పొందుతున్న శ్రీనివాస్ అత్యంత నిరుపేద కుటుంబం దయచేసి ఈ నిరుపేద కుటుంబాన్ని ఆదుకొని,
ఎవరైనా దాతలు ఉంటే  ఆదుకోగలరు, గూగుల్ పే ఫోన్ పే, 7659035087 ద్వారా నిరుపేద కుటుంబాన్ని మీ యొక్క ఆర్థిక సహాయం అందించగలరని కోరుతున్నారు.