బండిసంజయ్ అక్రమ అరెస్ట్ కు బిజెపి నిరసన. మధిర ఆగస్టు 24 ప్రజా పాలన ప్రతినిధి మున్సిపాలిటీ పరిధ

Published: Thursday August 25, 2022

నిన్న బండి సంజయ్ ని అక్రమంగా అరెస్ట్ చేసినందుకు మున్సిపాలిటీలో

అంబెడ్కర్ విగ్రహం వద్ద భారతీయ జనతాపార్టీ ఆధ్వర్యంలో నిరసన చెయ్యటం జరిగింది.బిజెపి జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు మాట్లాడుతూ ఎమ్మెల్సీ కవిత  లిక్కర్ కుంబకోణం లో ఆమె పాత్ర పై బిజెపి నాయకులు నిరసన కార్యక్రమం చేస్తే తెరాస నాయకులు వారిపై అమానుషంగా దాడి చేయడమే కాక పోలీస్ సైతం బిజెపి నాయకులను కార్యకర్తలపై దాడి చెయ్యడాన్ని అక్రమ అరెస్టులను చేయడాన్ని నిరసిస్తూ బిజెపి రాష్ట్ర అధ్యక్షులు బండి సంజయ్ 
 పాదయాత్ర శిబిరంలో దీక్ష చేస్తుంటే పోలీస్ అతి ఉత్సాహం తో అరెస్ట్ చెయ్యడాన్ని నిరసిస్తూ మధిర లో బిజెపి నాయకులతో కలిసి నిరసన కార్యక్రమం చెయ్యటం జరిగినది. బండి సంజయ్ కుమార్  ఈ తాటాకు చప్పుళ్లకు భయపడరని అన్నారు.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా కార్యదర్శి చిలివేరు సాంబశివరావు, బిజెపి కార్యవర్గ సభ్యులు కుంచం కృష్ణారావు, మధిర రూరల్ మండల బిజెపి ఇంచార్జి రామిశెట్టి నాగేశ్వరావు,బీజేవైఎం జిల్లా కార్యదర్శి కాసిన నాగభూషణం,బిజెపి నాయకులు కోనా నరసింహారావు, జీవి, పట్టణ కార్యదర్శి పగడాల నాగేంద్రబాబు, తదితరులు పాల్గొన్నారు