కరోనా వ్యాధితో ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు ప్రభుత్వం యాభై లక్షల నష్టపరిహారం ఇవ్వాలి

Published: Wednesday April 28, 2021

పరిగి 27 ప్రజాపాలన ప్రతినిధి : కోవిడ్ బారినపడి  ప్రాణాలు కోల్పోయిన జర్నలిస్టులకు యాభై  లక్షల నష్టపరిహారం ఇచ్చి వారి కుటుంబాలను ఆదుకోవాలని జర్నలిస్ట్ అసోసియేషన్ ఆఫ్ తెలంగాణ (జాట్) రాష్ట్ర అధ్యక్షుడు బాలస్వామి డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా పరిగి పట్టణ కేంద్రంలో ని ఎస్వీ గార్డెన్ లో జాబ్ వికారాబాద్ జిల్లా అధ్యక్షుడు రాఘవేంద్ర గౌడ్ అధ్యక్షతన ఏర్పాటు చేసిన జర్నలిస్టులు - ప్రజాసంఘాల రౌండ్ టేబుల్ సమావేశంలో జాట్ రాష్ట్ర అధ్యక్షులు బాలస్వామి బిజెపి జిల్లా అధ్యక్షులు సదానంద రెడ్డి పాల్గొన్నారు. కరోనా వంటి విపత్కర పరిస్థితుల్లో ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ ఫ్రంట్ వారియర్స్ తో సమానంగా ప్రాణాలను ఫణంగా పెట్టి పని చేస్తున్న జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించడం లేదని ఆవేదన వ్యక్తంచేశారు. కరోనాతో మృతి చెందిన జర్నలిస్ట్ కుటుంబాలకు ప్రభుత్వం యాభై లక్షల రూపాయల నష్టపరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. వికారాబాద్ జిల్లా జాట్ అధ్యక్షుడు రాఘవేందర్ గౌడ్ ఆద్వర్యంలో నిర్వహించిన ఈ రౌండ్ టేబుల్ సమావేశానికి సీనియర్ పాత్రికేయులు, ప్రజాసంఘ నాయకులు పాల్గొన్నారు.