సజావుగా సాగిన సర్వసభ్య సమావేశం

Published: Thursday August 25, 2022
ప్రజా పాలన నవాబుపేట్ .23
మండల పరిషత్ కార్యాలయంలో ఏర్పాటు చేసిన జనరల్ బాడీ మీటింగ్ లో ప్రజా ప్రతినిధులు తమ గ్రామాలకు సంబంధించిన విద్యుత్, వ్యవసాయ,విద్య, అభివృద్ధి, మంచి నీటి సరఫరా, ఉపాధి హామీ పథకం సంబంధించిన అధికారులను నిలదీశారు.అభివృద్ది పనులకు సంబంధించి బిల్లులు సరైన సమయంలో రావడానికి అధికారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు అని జడ్చర్ల ఎమ్మెల్యే లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో ఎం ఎల్ ఏ వెంటనే స్పందించి అలాంటి సమస్యలను పరిష్కరించాలని సర్పంచ్ లు ఎంపీటీసీ లను ఇబ్బందులకు గురి చేయకుండా యంపీడీఓ శ్రీలత ను హెచ్చరించారు.ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా చూడాలని ఆయన అన్నారు. చౌడూర్ సర్పంచ్ వెంకటేష్ తాను చేసిన అభివృద్ధి పనులకు సంబంధించి బిల్లులు ఒక్కటి కూడా ఇవ్వడం లేదు అంటూ ఎంఎల్ఏ లక్ష్మారెడ్డి దృష్టికి తీసుకెళ్లడంతో తాను కాంగ్రెస్ సర్పంచ్ కదా అంటూ సన్మానిస్తాం అంటూ హితవు పలికారు.ఇటీవల రోడ్డు ప్రమాదంలో మరణించిన యంపీటీసీ రాధా కృష్ణ, కొత్తపల్లి సర్పంచ్ చిత్రపటాలకు  పూలమాల వేసి నివాళులర్పించి రెండు నిమిషాల పాటు మౌనం పాటించారు.అనంతరం మండల కేంద్రము లో నూతన సులబ్ కాంప్లెక్స్ భవనాన్ని ప్రారంభించారు.ఈ కార్యక్రమంలో యంఆర్వో రాజేందర్ రెడ్డి యంపీడీఓ శ్రీలత యంపీపీ అనంతయ్య, జెడ్పీటీసీ రవిందర్ రెడ్డి, పీఏసీఎస్ అధ్యక్షుడు మాడెమోని నర్సింహులు, వైఎస్ ఎంపీపీ సంతోష్ రెడ్డి ,డిప్యూటీ తహశీల్దార్ లిఖితా రెడ్డి, ఆరై గోవర్ధన్ ,అనిల్, మార్కెట్ కమిటీ చైర్మన్ లక్ష్మయ్య టీఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి ప్రతాప్ రైతు బంధు కమిటీ మండల అధ్యక్షుడు మధుసూదన్ రెడ్డి గండు చెన్నయ్య గోపాల్ గౌడ్ మెండె శ్రీనివాస్ సత్యం యాదయ్య యాదవ్ తదితరులు కార్యకర్తలు పాల్గొన్నారు.