హలోమాల చలోఢిల్లీ కరపత్రం ఆవిష్కరణ

Published: Monday December 13, 2021
బెల్లంపల్లి: డిసెంబర్ 12 ప్రజాపాలన ప్రతినిధి:  బెల్లంపల్లి పట్టణంలో తెలంగాణ మాలమహానాడు బెల్లంపల్లి నియోజకవర్గ అధ్యక్షులు ఎరుకల శ్రీనివాస్ మరియు నియోజకవర్గ అధ్యక్షురాలు లింగాల అమృత ఆధ్వర్యంలో "హలో మాల చలో ఢిల్లీ" కార్యక్రమ కరపత్రాల ఆవిష్కరణ ఆదివారం నాడు జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా రాష్ట్ర ఉపాధ్యక్షుడు సబ్బని రాజనర్సు, రాష్ట్ర ప్రధాన కార్యదర్శి యాదగిరి పాల్గొన్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణ పేరుతో రాజకీయ పార్టీలు అన్నదమ్ముల్లా కలిసి ఉన్న మాల, మాదిగలను విడదీస్తున్నారని అదే కాకుండా అన్నదమ్ములకు లొల్లి పెట్టి రాజ్యాధికారం వారు అనుభవిస్తున్నారని అన్నారు. ఏబిసిడి వర్గీకరణ వద్దు కలిసి ఉండడం ముద్దు రెండు వర్గాలు కలిసి ఉంటేనే రాష్ట్రంలో, దేశంలో అతి పెద్ద దళిత శక్తి అవుతుందని ఈ శక్తి ముందు ఏ శక్తి నిలువదని వారన్నారు. ఎబిసిడి వర్గీకరణ కు వ్యతిరేకంగా ఈ నెల 15న ఛలో ఢిల్లీ కార్యక్రమానికి నాయకులు అందరం కలిసి చలో ఢిల్లీ జంతర్ మంతర్ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారని ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని కరపత్రాల ఆవిష్కరణ చేయడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ మాలమహానాడు ఉద్యోగ సంఘాల జిల్లా అధ్యక్షుడు గుర్రం ప్రదీప్, లింగాల కిరణ్, ముల్కల చిన్నులు, కంది రాజేశ్వరరావు, లింగాల పోషo, గుండా తిరుపతి, భోగ సాగర్, గుండా రాధా, పులి ప్రసాద్, లింగాల కిషోర్, తదితరులు పాల్గొన్నారు.