పంటలను పరిశీలించిన జేడీఏ, ఏవో.. తల్లాడ, నవంబర్ 23 (ప్రజా పాలన న్యూస్):

Published: Thursday November 24, 2022
తల్లాడ మండల పరిధిలోని కలకొడిమ గ్రామంలో బుధవారం జిల్లా వ్యవసాయ అధికారి బి. సరిత, మండల వ్యవసాయ అధికారి తాజుద్దీన్ తో కలిసి సుమారుగా 20 సర్వే నెంబర్లలోని వివిధ పంటలను  స్థానిక రైతులతో కలిసి  పరిశీలించారు. మిర్చి, మొక్కజొన్న పంటలను పరిశీలించి వివిధ పురుగులు, తెగుళ్ల నివారణ చర్యలను వివరించారు. వరి కోత పూర్తయిన రైతులు వరి ధాన్యాన్ని 17 శాతం లోపు తేమ వచ్చేలా ఆరబెట్టి, తూర్పారా పట్టి నాణ్యమైన వాటిని మాత్రమే ధాన్యం కొనుగోలు కేంద్రాలకు తీసుకు రావాలని, ప్రభుత్వం ప్రకటించిన మద్దతుధర పొందాలని రైతులను కోరడం జరిగింది. ఈ కార్యక్రమంలో ఏవో(టెక్నికల్ )రాజు, వ్యవసాయ విస్తరణ అధికారి నాగేశ్వరరావు, కలకొడిమ రైతుబంధు సమితి కోఆర్డినేటర్ హస్సాన్ పాల్గొన్నారు.