కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగిద్దాం

Published: Friday May 20, 2022
గొడిసెల చంద్ర మొగిలి
 
బెల్లంపల్లి  మే  19  ప్రజా పాలన ప్రతినిధి: కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య ఆశయాలను కొనసాగించాలని, కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు గొడిసెల చంద్రమొగిలి అన్నారు.
 గురువారం  బెల్లంపల్లి పట్టణంలో ని  సి ఐ టి యు కార్యాలయంలో  ఏర్పాటు చేసిన కార్యక్రమంలో సుందరయ్య  చిత్రపటానికి పూలమాలలు వేసి 37 వ వర్ధంతి కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు.
ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ
కామ్రేడ్ సుందరయ్య .తొమ్మిదవ తరగతి నుండే సమానత్వం, విప్లవ భావజాలంతో పెరిగినటువంటి వ్యక్తని, ఉన్నత  రెడ్డి వర్గం లో జన్మించినప్పటికీ సామాన్య మానవులకు సేవ చేయాలనుకునే అంకితభావం తో పనీ చేశాడని, అంతేకాకుండా వందల ఎకరాల భూమిని పేదలకు నిస్వార్థంగా పంచిఇచ్చిన వ్వ్యక్తనీ అన్నారు.
 భారతదేశాన్ని అభివృద్ధి చేస్తా అని చెప్పి అంకితభావంతో పని చేసినటువంటి వ్యక్తనీ,దేశంలో కుల వ్యవస్థను నిర్మూలించడానికి ఆయన ఎంతో కృషి చేసిన మహనీయుడని, ఎస్సీ, ఎస్టీ, బిసి, ఇళ్ల కు వెళ్లి సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేసి వారితో  కూర్చుని, కులాలు, మతాలు లేవని చాటిచెప్పిన ఏకైక వ్యక్తి అని, మహనీయుని ఆశయసాధనలో నే 1998 లో కుల వివక్ష వ్యతిరేక పోరాట సంఘం ఏర్పాటు చేయడం జరిగిందనీ, ఆయన అన్నారు.
  పార్లమెంటుకు ఎన్నికై.  ప్రసంగిస్తుం టే. అప్పటి ప్రధాని నెహ్రూ తో సహాప్రతిపక్షాలు. ఆసక్తి తో వినేవారనీ, అసెంబ్లీలో కూడా ప్రతిపక్షంగా ఉండి పేదల యొక్క అభివృద్ధికి కృషి చేసిన మహనీయుడనీ.  భారత దేశం లొ సిపిఎం పార్టీ అభివృద్ధికి  ఎంతో కృషి చేశారనీ . స్వాతంత్రం వచ్చి 75 సంవత్సరాలు గడుస్తున్నా. దేశంలో కుల వివక్ష ఇప్పటివరకు పొవడం లేదనీ . పేదలు ఇంకా పేదలుగా బ్రతుకుతున్నారనీ దేశంలో కొద్ది మందే బడా పెట్టుబడిదారులు గా. ధనికులు గా అభివృద్ధి చెందుతున్నారు తప్ప పేదల బతుకులు మాత్రం మారడం లేదనీ . కాబట్టి  దేశంలోని యువత. విద్యార్థులు. నిరుద్యోగులు. అమర వీరుడు కామ్రేడ్ పుచ్చలపల్లి సుందరయ్య గారి ఆశయం కోసం. సిపిఎం మార్కిస్టు పార్టీ. ఆధ్వర్యంలో పోరాటాల లోకి రావాలని ఆయన  పిలుపునిచ్చారు.
 ఈ కార్యక్రమంలో. సిపిఎం జిల్లా కమిటీ సభ్యులు మాల గురజాల సర్పంచ్. గూమస అశోక్. సీఐటీయూ మంచిర్యాల జిల్లా ఉపాధ్యక్షుడు. అబ్బో జు రమణ. టి వై ఎఫ్ ఐ. మండల కమిటీ నాయకులు.ఓద్ది రవీందర్. ఎస్ఎఫ్ఐ. జిల్లా అధ్యక్షుడు. దాగం శ్రీకాంత్. సిపిఎం పార్టీ నాయకులు. ఎస్ కె. యాకూబ్. ఈర్ల రాజ మొగిలి. చల్లూరి తిరుపతి. దుర్గం సుమన్. కె. నాగరాజు. గోనె శంకర్. ఎండి. జహంగీర్ ఖాన్. తదితరులు పాల్గొన్నారు.