అధికారులు శుభోదయం అంటూ పల్లెల్లోకి పరుగులు* *గడప గడపకు కాలే యాదయ్య పలకరింపుతో వెలుగులు* *క్ష

Published: Tuesday November 22, 2022
చేవెళ్ల మండల కేంద్రంలో
సోమవారం శుభోదయం కార్యక్రమంలో భాగంగా మండల పరిధిలోని కమ్మెట, గొల్లగూడ గ్రామాలలో ఎమ్మెల్యే కాలే  యాదయ్య పర్యటించారు. కమ్మెట గ్రామంలో చాలా ఏళ్లుగా నీటి ఎద్దడి ఉందని ప్రజలు ఎమ్మెల్యేకు తెలుపగా  సంబంధిత అధికారులకు నీటి సమస్యను పరిష్కరించాలని ఆదేశించారు. గ్రామంలో నీటి సమస్య పరిష్కారం కొరకు భగీరథ ప్రయత్నం చేస్తానని హామీ ఇచ్చారు. అదేవిధంగా గ్రామంలో ఇళ్లపైనే విద్యుత్ తీగలు వేలాడుతూ ఉండడం, గ్రామంలోని ప్రజలు రోడ్లు సరిగా లేవని ఎమ్మెల్యే నిలదీయగా రోడ్ల సమస్యలను వెంటనే పరిష్కరిస్తానని హామీ ఇచ్చారు. గ్రామంలో అర్హులైన వారికి ఆసరా పింఛన్లు రావడంలేదని తెలుపగా కొన్ని సాంకేతిక సమస్యల వలన ఆసరా పింఛన్లు రావడంలేదని కొన్ని రోజుల్లోనే ఆసరా పింఛన్లు సమస్యను పరిష్కరిస్తానని తెలిపారు. అలాగే గొల్లగూడెం గ్రామంలో నీటి సమస్య, సీసీ రోడ్డు విద్యుత్ సంబంధించిన సమస్యలను పరిష్కరించాలని అధికారులను ఆదేశించారు. ఎమ్మెల్యే యాదయ్య మాట్లాడుతూ.... టిఆర్ఎస్ ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ ఫలాలు గ్రామాలలో గడపగడపకు అందుతున్నాయా లేవా అని తెలుసుకుంటున్నానని అన్నారు. పల్లెలు దేశానికి పట్టుకొమ్మలాంటివని అలాంటి పల్లెల అభివృద్ధి ప్రధాన లక్ష్యంగా టిఆర్ఎస్ ప్రభుత్వం పని చేస్తుందని సీఎం కేసీఆర్ గ్రామాల అభివృద్ధి కొరకు ప్రత్యేక శ్రద్ధ చూపిస్తున్నారని అన్నారు. గత ప్రభుత్వ పాలనలో గ్రామాలలో చాలా సమస్యలు ఉండేవి అని  టిఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామాలలో రోడ్లు,ఇంటింటికి మిషన్ భగీరథ నీరు, రైతులకు  24 గంటల ఉచిత విద్యుత్ అందిస్తున్నామని తెలిపారు. గ్రామాలు పచ్చగా ఉండాలని  పల్లె ప్రకృతి వనాలు ,పరిశుభ్రంగా ఉండాలని గ్రామాలలో చేత్త సేకరణకు ట్రాక్టర్లు, వైకుంఠధామాలను ఏర్పాటు చేసిందని తెలిపారు. ప్రభుత్వం ప్రవేశపెడుతున్న సంక్షేమ పథకాన్ని టిఆర్ఎస్ పార్టీకి శ్రీరామరక్ష అని అన్నారు.
ఈ కార్యక్రమంలో చేవెళ్ల ఎంపీపీ మాల్గారి విజయలక్ష్మి రమణారెడ్డి, జడ్పిటిసి మర్పల్లి మాలతి కృష్ణారెడ్డి ,ఏఎంసీ చైర్మన్ మిట్ట వెంకట రంగారెడ్డి, టిఆర్ఎస్ సీనియర్ నాయకులు మల్గారి రమణారెడ్డి, కృష్ణారెడ్డి, నాగార్జున రెడ్డి ,వైస్ ఎంపీపీ కర్నె శివప్రసాద్ మండల అధ్యక్షులు పెద్దోళ్ల ప్రభాకర్ సర్పంచ్ల సంఘం అధ్యక్షుడు షేరి శివారెడ్డి, రవీందర్,అబ్దుల్ గని శేఖర్,భాస్కర్, వివిధ శాఖల ప్రభుత్వ అధికారులు కమ్మేట సర్పంచ్ తులసి రాజు, మాజీ సర్పంచ్ హనుమంత్ రెడ్డి, గొల్లగూడెం సర్పంచ్ రామచందర్ రెడ్డి వార్డ్ మెంబర్లు పార్టీ కార్యకర్తలు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.