మధుకాన్ లో చెరుకు క్రషింగ్ ప్రారంభం. ధర ప్రకటించకపోవటంతో రైతులు అగ్రహం. ఎంపీ ఫ్యాక్టరీ లో ఉం

Published: Monday November 14, 2022
పాలేరు నవంబర్ 13 ప్రజాపాలన ప్రతినిధి
 నేలకొండపల్లి
ఖమ్మం జిల్లా, నేలకొండపల్లి మండలం లోని రాజేశ్వరపురం మధుకాన్] షుగర్ అండ్ పవర్ ఇండ్రస్టీస్ లో 2022-23 సీజన్ క్రషింగ్ ను ఆదివారం ఫ్యాక్టరీ వ్యవస్థాపకులు, ఖమ్మం ఎంపీ నామా నాగేశ్వరరావు చేతలు మీదుగా ప్రారంభించారు. తొలుత ఎంపీ దంపతులు ప్రత్యేక పూజలు అనంతరం క్రషింగ్ ను ప్రారంభించారు. రైతులను ఉద్దేశించి శ్రీ నామా నాగేశ్వరరావు మాట్లాడారు. ఫ్యాక్టరీ ఆర్థిక స్థితిగతులు ను వివరించారు. రైతుల సంక్షేమం కోసమే ఫ్యాక్టరీ ని నడుపుతున్నట్లు తెలిపారు. 20 ఏళ్ల క్రషింగ్ సీజన్లో 17 పర్యాయాలు ఫ్యాక్టరీకి నష్టం. వాటిల్లినట్లు ప్రకటించారు. రైతు బిడ్డగా రైతులకు అండగా ఉంటానని. -పేర్కొన్నారు. కాగా ఈ సీజన్ లో మద్దతు ధర ను ప్రకటించకుండానే
క్రషింగ్ సీజన్ ప్రారంభించటం పట్ల రైతులు అగ్రహం వ్యక్తం చేశారు. ఎంపీ ధరను ప్రకటించకుండా వేదిక దిగుతుండుగా, పలువురు రైతులు ధర ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. రెండు, మూడు రోజుల్లో ధర ను ప్రకటిస్తానని చెప్పి వెళ్లిపోయారు. దీంతో రైతులు అగ్రహం వ్యక్తం చే శారు. అరుపులు, కేకలు నడుమ కొంత ఉద్రిక్తత పరిస్థితి నెలకొంది. నామా నాగేశ్వరరావు ఫ్యాక్టరీలో ఉండగానే, యండీ . కృష్ణయ్య కారు ను రైతులు అడ్డుకున్నారు. ధర ను ప్రకటించాలని డిమాండ్ చేశారు. కొంత సేపు ఉద్రిక్తత నడుమ యజమాన్యం అక్కడ నుంచి వెళ్లిపోయింది. ఈ 
సందర్భంగా రైతులు మాట్లాడుతూ... పెరిగిన ధరలకు అనుగుణంగా టన్నుకు రూ.3500 చొప్పున ఇవ్వాలని డిమాండ్ చేశారు. లేనిపక్షంలో ఆందోళన తీవ్రతం చేస్తామని హెచ్చరించారు. క్రషింగ్ కార్యక్రమంలో రైతు సమన్వ సమితి జిల్లా అధ్యక్షుడు నల్లమల్ల వెంకటేశ్వరరావు, చెరుకు అభివృద్ధి మండలి చైర్మన్ నెల్లూరి లీలాప్రసాద్, డైరెక్టర్ వీరవెల్లి నాగేశ్వరరావు, ఎంపీపీ వజ్జా రమ్య, ఫ్యాక్టరీ జనరల్ మేనేజర్ కోటయ్య, సర్పంచ్ల సంఘం మండలాధ్యక్షుడు గండు సతీష్, రైతు సంఘం. ప్రతినిధులు రచ్చా నరసింహారావు, నెల్లూరి భద్రయ్య, కడియాలు శ్రీనివాసరావు,దండా రంగయ్యా, మంకెన వెంకటేశ్వరరావు, చింతనిప్పు సైదులు తదితరులు పాల్గొన్నారు.