ప్రభుత్వ ఆన్ లైన్ సేవలకు తాత్కాలిక అంతరాయం

Published: Friday July 09, 2021

హైదరాబాద్ 8 జులై ప్రజాపాలన: తెలంగాణ రాష్ట్రంలోని ప్రభుత్వ వెబ్ సైట్లు, అన్ని ఆన్ లైన్ సేవలు రేపటి నుండి అంటే జులై 9 నుండి జులై 11 వరకు (దాదాపు మూడు రోజుల పాటు) అందుబాటులో ఉండవని సంబంధిత ప్రిన్సిపల్ సెక్రటరీ, ఇన్ ఫర్ మేషన్ టెక్నాలజీ, ఎలక్ట్రానిక్ మరియు కమ్యునికేషన్ విభాగం ఒక ప్రకటన ద్వారా తెలియజేశారు. వివరాలలోకి వెలితే జులై 9 శుక్రవారం రాత్రి 9గంటల నుండి జులై 11 ఆదివారం రాత్రి 9గంటల వరకు సాంకేతిక కారణాలు - స్టేట్ డాటా సెంటర్ (SDC) సర్వర్ల పవర్ బ్యాక్ అప్ వ్యవస్థ ఆధునీకరణలో భాగంగా సేవలు అందుబాటులో ఉండవని ఆ విభాగం ప్రిన్సిపల్ సెక్రటర్ ఒక ప్రకటనలో తెలియజేశారు. ఈ సాంకేతిక పరమైన అంతరాయానికి అందరు సహకరించాలని కోరారు. ఇతర వివరాల కొరకు హెల్ఫ్ డెస్కు నెంబరు: 91548 30572 మరియు ప్రాజెక్టు మేనేజర్ నెంబర్: 91548 305721 ను సంప్రదించగలరు.