కోవిడ్ కేర్ సెంటర్ కు ఆక్సీజన్ కాన్సెన్ట్రేటర్ లు అందజేత

Published: Friday May 07, 2021
మేడిపల్లి, మే 6 (ప్రజాపాలన ప్రతినిధి) : పీర్జాదిగూడ మున్సిపల్ కార్పోరేషన్ పరిధిలోని మేడిపల్లి కోవిడ్ కేర్ సెంటర్ లో అమెజాన్ వెబ్ సర్వీస్ వారి సహకారంతో స్రుజీ ఇంపాక్ట్ ఫౌండేషన్ అను స్వచ్చంద సంస్థ వారు 10 ఆక్సీజన్ కాన్సెన్ట్రేటర్ లను మేయర్ జక్క వెంకట్ రెడ్డి చేతుల మీదుగా కోవిడ్ కేర్ సెంటర్ కు అందజేశారు. ఈ కార్యక్రమంలో కార్పొరేటర్లు కౌడే పోచయ్య, సుభాష్ నాయక్, నాయకులు పప్పుల అంజి రెడ్డి, బైటింటి ఈశ్వర్ రెడ్డి, బొడిగే కృష్ణ గౌడ్, బండారు రవీందర్, జావిద్ ఖాన్, కోవిడ్ వైద్య సిబ్బంది, మున్సిపల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.