మినీ ట్యాంక్ బాండ్ సమీపంలో వ్యర్థ పదార్థాలతో వచ్చే వాసనతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు. సమస్య పరి

Published: Wednesday July 20, 2022

కోరుట్ల, జూలై 19 (ప్రజాపాలన ప్రతినిధి):
కోరుట్ల మున్సిపల్ కమిషనర్ కు వినతి పత్రం అందించిన ఎం.ఐ.ఎం పట్టణ అధ్యక్షుడు నాలుగో వార్డ్ కౌన్సిలర్ మహమ్మద్ సాబీర్ అలీ, ఈ సందర్భంగా మహమ్మద్ సాబీర్ అలీ మాట్లాడుతూ చాలా కాలనీలు పరిశీలించమని, గత వారం రోజుల నుంచి కురిసిన భారీ వర్షాలకు చాలా కాలనీలు నీటమునిగాయి. రోడ్ల పక్కన చెత్తాచెదారం తో విపరీతమైన దుర్వాసన వస్తుందని అలాగే ముఖ్యంగా మినీ ట్యాంక్ బండ్ లో విపరీతమైన పిచ్చి మొక్కలు చాలా పెరిగాయని, అలాగే అవి కుళ్ళి పోయి చెత్త చెదారం అలాగే పాములు తేళ్లు విష పురుగులు ఇళ్లల్లోకి వస్తున్నాయి. వీటివలన ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు తీవ్ర దుర్వాసనతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు ముఖ్యంగా మినీ ట్యాంక్ బండ్ ప్రాంతంలో చాలా సమస్య వున్నాయని ఈ విషయాల పైన వెంటనే స్పందించి పరిష్కరించాలని మున్సిపల్ కమిషనర్ కి వినతి పత్రం సమర్పించారని మహమ్మద్ సాబీర్ అలీ తెలిపారు. ఈ కార్యక్రమంలో రెండో వార్డు ఎం ఐ ఎం రఫీ, రహీమ్,రవుఫ్ , ఇస్మైల్, మన్నె, తదితరులు పాల్గొన్నారు.