ఘనంగా రాఘవేంద్ర స్వామి జయంతి వేడుకలు

Published: Monday February 27, 2023

జన్నారం, ఫిబ్రవరి 26, ప్రజాపాలన: రాఘవేంద్ర స్వామి జయంతి సందర్భంగా మండల కేంద్రంలోని మేదరి వాడలో ఉన్న ఆంజనేయస్వామి, మహాలక్ష్మి దేవాలయంలో ఘనంగా వేడుకలను వేద పండితులు జరిపారు. ఆదివారం ఆంజనేయస్వామి దేవాలయంలో ప్రత్యేక పూజలు,అభిషేకాలు నిర్వహించారు. రాఘవేంద్ర స్వామి జయంతి పూజకు భక్తులు అధిక సంఖ్యలో పాల్గొని తీర్థ ప్రసాదాలు తీసుకొని స్వామివారి కృపకు పాత్రులైయారన్నారు. ఈ కార్యక్రమంలో జక్కు సత్తయ్య, లచ్చన్న, సుధాకర్, శీల రమేష్, జక్కు రమేష్, శ్రీనివాస్, భూమన్న, పొనకల్ సర్పంచ్ జక్కు భూమేష్, వేద పండితులు, భక్తులు, తదితరులు పాల్గొన్నారు