చలివేంద్రాన్ని ప్రారంభించిన జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ

Published: Tuesday April 06, 2021
వికారాబాద్ జిల్లా ప్రతినిధి ఏప్రిల్ 05 ( ప్రజాపాలన ) : తాండూర్ మండల పరిధిలో గల బెల్కటూర్ గ్రామంలో వేసవి కాలం దృష్టిలో పెట్టుకోని గ్రామానికి చెందిన మాజీ విఆర్ఓ పట్లోళ్ల నారాయణ్ రెడ్డి జ్ఞపకార్థం అతని కుమారుడు శంకర్ రెడ్డి చలివేంద్రాన్ని ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ మురళీకృష్ణ  చలివేంద్రాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో పెద్దేముల్ మాజీ మండల అధ్యక్షులు కోహిర్ శ్రీనివాస్, గ్రామ నాయకులు శిల్లా మల్లికార్జున్, ఉప సర్పంచ్ శిల్లా నాగరాజ్, సీనియర్ విలేకరి మఠం నిరంజన్, హోటల్ మల్లేశం, పల్లె నర్సిములు, ఈడ్గి శ్రీనివాస్, గ్రామ ప్రజలు, యువకులు తదితరులు పాల్గొన్నారు.