బిఆర్ఎస్ పార్టీ పై హర్షం వ్యక్తం చేస్తున్న సారపాక కాసిం సార్ వీధి ప్రజలు... రాబోయే కాలంలో అభివ

Published: Wednesday December 28, 2022
ఈ రోజు అనగా 27/12/2022 న తమ రోడ్డు ప్రారంభమగు (కుడి) బత్తుల రామయ్య  ఇంటి వద్ద నుండి వీధి చివర ఇల్లు గల (ఎడమ) కాండ్రేగుల వీరభద్రం వారి ఇంటి వరకు 210 మీటర్ల పొడవు గల సీసీ రోడ్డును ఏ ఈ వెంకటేశ్వరరావు  ఆధ్వర్యంలో  కొలతలు తీసుకొని మరో నాలుగు రోజుల్లో ప్రారంభిస్తామని అధికారకంగా ప్రకటించినందుకు హర్షం వ్యక్తం చేస్తున్నాము.
పినపాక నియోజకవర్గ ఎమ్మెల్యే మరియు ప్రభుత్వ విప్ శ్రీ రేగ కాంతారావు  ఆదేశాల మేరకు "అనునిత్యం ప్రజల కొరకు" కార్యక్రమం ద్వారా ప్రతి వీధి సమస్యలను పరిష్కరించడానికి చేపట్టిన కార్యక్రమంలో.
గోదావరి వరదల అనంతరం అస్సలు నడవడానికే వీలులేని  రోడ్డును సందర్శించి తమ సమస్యలను తెలుసుకుని  ప్రథమ సమస్య అయిన మంచినీటి సమస్యను వారం రోజుల్లో పరిష్కరించిన ఘనత బిఆర్ఎస్ పార్టీ వారిది మరియు అత్యంత అద్వాన్న స్థితిలో ఉన్న తమ రోడ్డును సీసీ రోడ్డు ద్వారా మోక్షం కల్పించనున్న బిఆర్ఎస్ పార్టీపై వీధి సభ్యులందరము హర్షం వ్యక్తం చేస్తున్నామని
తమ వీధి పై ప్రత్యేక చొరవతో మెలుదిరిగి ఉన్న వీధిని సైతం  చివర వరకు ఒకేసారిగా సీసీ రోడ్డును శాంక్షన్ చేయించిన బూర్గంపహాడ్ మండల జెడ్పిటిసి శ్రీమతి కామిరెడ్డి శ్రీలత కి, మండల అధ్యక్షులు శ్రీ గోపిరెడ్డి రమణారెడ్డి, వర్కింగ్ ప్రెసిడెంట్ శ్రీ జలగం జగదీష్ కి, బృగంపహాడ్ మండల సొసైటీ చైర్మన్ శ్రీ బిక్కసాని శ్రీనివాసరావు కి, సారపాక టౌన్ అధ్యక్షులు శ్రీ కొనగంచి శ్రీనివాసరావు కి, మహిళా  అధ్యక్షురాలు శ్రీమతి ఎల్లంకి లలిత కి,  మరియు సన్నిహిత సమూహ అనుచర మిత్ర సభ్యులందరికీ కాసిం సార్ వీధి సభ్యులందరి మరియు కన్వీనర్ మహమ్మద్ అబ్దుల్ సాబీర్  తరపున ప్రతి ఒక్కరికి పేరుపేరునా  ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నామని వారి ఈ సందర్భంగా తెలియజేశారు రాబోయే కాలంలో బిఆర్ఎస్ పార్టీ ఇలాంటి మంచి కార్యక్రమాలు ప్రజల అవసరాలు తెలుసుకొని వెళ్లే పార్టీ బిఆర్ఎస్ పార్టీ ఒకటేనని ముక్తకంఠంతో వారు తెలియజేశారు.