తెరాస నాయకులకు పార్టీ సభ్యత్వం విధివిధానాలు:సంజయ్ కుమార్

Published: Wednesday February 17, 2021
బీరుపూర్/సారంగాపూర్, ఫిబ్రవరి 16 (ప్రజాపాలన): బీరుపూర్ మరియు సారంగాపూర్ మండలాలకు చెందిన తెలంగాణ రాష్ట్ర సమితి నాయకులకు కార్యకర్తలకు పార్టీ సభ్యత్వం నమోదు విధివిధానాలను స్థానిక ఎమ్మెల్యే డా. సంజయ్ కుమార్ తెలియజేశారు. పార్టీ కోసం ప్రతి కార్యకర్త సైనికునిగా పని చేస్తూ పార్టీ అభివృద్ధికి పాటుపడాలని సూచించారు. ఈ కార్యక్రమంలో సారంగాపూర్ ఎంపీపీ కోలా జమునశ్రీనివాస్ జడ్పీటీసీ మేడిపల్లి మనోహర్ రెడ్డి ముప్పాల రాంచందర్ రావు కోలుముల రమణ గుర్రాల రాజేందర్ రెడ్డి నారపాక రమేష్ ముక్క శంకర్ ముక్క వెంకటేష్ వివిధ గ్రామాల సర్పంచులు ఎంపీటీసీలు నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.