భగత్ సింగ్ స్పూర్తితో పోరాడుదాం

Published: Wednesday September 29, 2021
ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు తాళ్ల నాగరాజు ఆన గంటి వెంకటేష్ 
మధిర, సెప్టెంబర్ 27, ప్రజాపాలన ప్రతినిధి : షహీద్ భగత్సింగ్ 114వ జయంతి సందర్భంగా మధిర పట్టణంలో ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ మధిర మండల పట్టణ కమిటీల ఆధ్వర్యంలో భారీ బైక్ ర్యాలీ నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా భగత్సింగ్ ఆశయాలను లక్ష్యాలను నిరంతరం యువతకు స్ఫూర్తిని అందించేందుకు కాంగ్రెస్ ఆఫీస్ ఎదురుగా షాహిద్ భగత్ సింగ్ విగ్రహ ఏర్పాటు చేయడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి లు గా విచ్చేసిన ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ రాష్ట్ర కార్యదర్శులు తాళ నాగరాజు ఆనగంటి వెంకటేశ్వర్లు మాట్లాడుతూ నేటి యువత నిరుద్యోగం ఉపాధి కోసం ప్రభుత్వ సంస్థలు అమ్మకానికి వ్యతిరేకంగా ముంచుకొస్తున్న సామ్రాజ్యవాదానికి వ్యతిరేకంగా భగత్సింగ్ స్ఫూర్తితో ఉద్యమించాలని పిలుపునిచ్చారు పాలకుల నయవంచన తప్పుడు వాగ్దానాలను ప్రజల సొమ్మును కార్పొరేట్ శక్తులకు సామ్రాజ్యవాదులకు కట్టబెట్టేందుకు పాలకులు చేస్తున్న ప్రయత్నాలు ప్రజలందరికీ అర్ధమయ్యేలా వివరించి ఉద్యమాలు నిర్మించాలని అందుకు భగత్సింగ్ యువతికి స్ఫూర్తిని ఇస్తారని అలాంటి యువత నిరంతరం నెలకొల్పేందుకు మధిర పట్టణ నడిబొడ్డులో భగత్ సింగ్ విగ్రహం అవసరాన్ని గుర్తించి యువత విద్యార్థులు ఎస్ఎఫ్ఐ డివైఎఫ్ఐ ఆధ్వర్యంలో విగ్రహ ఏర్పాటు చేయడం అభినందనీయమన్నారు ఈ కార్యక్రమంలో ఎస్ఎఫ్ఐ జిల్లా అధ్యక్ష కార్యదర్శులు జమ్మి అశోక్ వడ్రాణపు మధు, డివైఎఫ్ఐ అధ్యక్ష కార్యదర్శులు షేక్ బషీరుద్దీన్ మద్దాల ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు.. భగత్సింగ్ విగ్రహ ఏర్పాటు తర్వాత అఖిలపక్ష పార్టీ నాయకులు సంఘీభావం తెలిపారు.. SFI జిల్లా కమిటీ సభ్యులు సుధాకర్, మధిర టౌన్ కార్యదర్శి A. పేరు స్వామి, DYFI జిల్లా నాయకులు రమేష్, నరేష్, అన్వర్ ఖాన్, నవీన్, నాగరాజు, సైదులు, అనిల్, SFI నాయకులు సురేష్, మస్తాన్, అక్బర్ తదితరులు పాల్గొన్నారు...