22 శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లను అందచేసిన - ప్రభుత్వ విప్పు గాంధీ, డి ఎం హెచ్ ఓ డా. స్వరాజ్యాలక్ష్మి

Published: Thursday February 17, 2022
శేరిలింగంపల్లి -ప్రజాపాలన/ న్యూస్ :డివిజన్ పరిధిలోని హఫీజ్పెట్ లో గల పట్టణ ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో కార్పొరేటర్లు పూజిత జగదీశ్వర్ గౌడ్, జగదీశ్వర్ గౌడ్, నార్నె శ్రీనివాస రావు, ఉప్పలపాటి శ్రీకాంత్, డి ఎం హెచ్ ఓ డా.స్వరాజ్యాలక్ష్మి, డిప్యూటీ డి ఎం హెచ్ ఓ డా. సృజన, డా.వినయ్ తో కలిసి ఆశా వర్కర్లకు 22 శాంసంగ్ స్మార్ట్ ఫోన్ లను అందచేసిన ప్రభుత్వ విప్ ఆరెకపూడి గాంధీ. ఈ సందర్భంగా ప్రభుత్వ విప్ గాంధీ మాట్లాడుతూ.. క్షేత్రస్థాయిలో పనిచేసే ఆశా సిబ్బందికి ఈ స్మార్ట్ ఫోన్ లు సమాచార సేకరణలో ఎంతగానో తోడ్పడుతాయి అని, క్షేత్ర స్థాయిలో ప్రజలలోకి వెళ్ళినప్పుడు ఫీవర్ సర్వే, బిపి, షుగర్, ప్రెగ్నెన్సీ వంటి సర్వే వివరాలను ఈ స్మార్ట్ ఫోన్ ల ద్వార సులభంగా నిక్షిప్తం చేయడానికి తోడ్పడుతాయి అని, ఎంతో ఉపయోగకరమైనవి అని, డాక్టర్ లకు, ఉన్నతాధికారులకు అనుసంధాన కర్తలుగా పనిచేయాలని వీటిని చక్కగా సద్వినియోగపర్చుకొని సత్పలితాలను ఇవ్వాలని, వీటిని సక్రమంగా వినియోగొంచుకోవలని ప్రభుత్వ విప్ గాంధీ పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో హఫీజ్పెట్ డివిజన్ అధ్యక్షులు బాలింగ్ గౌతమ్ గౌడ్, మాదాపూర్ డివిజన్ అధ్యక్షులు ఎర్రగుడ్ల శ్రీనివాస్ యాదవ్, తెరాస నాయకులు వాలా హరీష్ రావు, బాలింగ్ యాదగిరి గౌడ్, వెంకటేష్ గౌడ్, సుదేశ్ కుమార్, సబీర్, కాజా మరియు వైద్య సిబ్బంది తదితరులు పాల్గొన్నారు