విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలి. ..జిల్లా అదనపు జడ్జి జె మైత్రేయ.

Published: Thursday October 27, 2022
ప్రజా పాలన , అక్టోబర్ 26 , శ్రీరాంపూర్.
 
విద్యార్థులు చట్టాలపై అవగాహన పెంపొందించుకోవాలని మంచిర్యాల జిల్లా అదనపు జడ్జ్ మైత్రేయ అన్నారు. బుధవారం శ్రీరాంపూర్ ఏరియాలోని సిసిసి కస్తూరిబా గాంధీ బాలికల విద్యాలయంలో మండల న్యాయ సేవా సంస్థ చైర్మన్ బి.సత్తయ్య ఆధ్వర్యంలో తెలంగాణ రాష్ట్ర న్యాయ సేవాధికారి సంస్థ ఆదేశాల మేరకు అవగాహన సదస్సు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పాల్గొని ఆయన మాట్లాడారు. విద్యార్థులు తీసుకోవాల్సిన జాగ్రత్తలు చట్టపరమైన హక్కులు, బాల్యవివాహాలు, పిల్లల అక్రమ రవాణా, పిల్లలపై సోషల్ మీడియా ప్రభావం ,సెల్ ఫోన్ వాడకం, ఫోక్స్ చట్టం, న్యాయస్థానాలు చట్టపరంగా బాలికలకు ఏ విధంగా సహాయపడుతాయో అనే పలు అంశాల గురించి వివరించారు. వివిధ రకాల హెల్ప్ లైన్ నెంబర్లను వాటి గురించి అవగాహన కల్పించారు. ఈ కార్యక్రమంలో సీనియర్ న్యాయవాదులు చుంచు సదానందం, డేగ రవీందర్ , భుజంగరావు,  ఎస్ఐ సంజీవ్ , మంచిర్యాల్ సఖి కేంద్రం నిర్వాహకులు శైలజ,  కస్తూరిబా పాఠశాల స్పెషల్ అధికారి మౌనిక , ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.