మున్నూరు కాపు చైతన్య యాత్ర విజయవంతం చేయాలి

Published: Friday December 16, 2022
* మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్
వికారాబాద్ బ్యూరో 15 డిసెంబర్ ప్రజా పాలన : డిసెంబర్ 19 నుండి మున్నూరు కాపు చైతన్య యాత్ర ప్రారంభం కానున్నదని, పెద్ద సంఖ్యలో హాజరు కావాలని మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షుడు డాక్టర్ కొండ దేవయ్య పటేల్ పిలుపునిచ్చారు. గురువారం మున్సిపల్ పరిధిలోని ఓ ప్రైవేట్ ఫాం హౌజ్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాశానికి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ 33 జిల్లాలలో మున్నూరు కాపు సామాజిక చైతన్య యాత్ర చేపట్టనున్నామని వివరించారు. తెలంగాణ రాష్ట్రంలో మున్నూరు కాపు కుల బాంధవుల ఐక్యత కోసం మున్నూరు కాపు గర్జనను హైదరాబాద్ నడిబొడ్డున నిర్వహించనున్నట్లు స్పష్టం చేశారు.
 రాష్ట్రంలో పెద్ద సంఖ్యలో ఉన్న మున్నూరు కాపులకు ఆర్థికంగా, సామాజికంగా, రాజకీయంగా న్యాయం జరగడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. మున్నూరు కాపుల హక్కుల సాధన కోసం మున్నూరు కాపు గర్జనను హైదరాబాద్ నడిబొడ్డున రెండు లక్షల మందితో నిర్వహించనున్నట్లు ఆయన వెల్లడించారు. తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న 33 జిల్లాలు, 119 నియోజకవర్గాలలో మున్నూరు కాపు చైతన్య యాత్ర కార్యక్రమాలను నిర్వహిస్తున్నామని వివరించారు. మున్నూరు కాపులను ఐక్యం చేయుటకు సభను విజయవంతం చేయాలని పిలుపునిచ్చారు. మొదటగా డిసెంబర్ 19న వేములవాడ మొదటి మీటింగ్ నియోజకవర్గంలో కార్యక్రమం వేములవాడ పట్టణంలోని మున్నూరు కాపు సత్రంలో ఏర్పాటు చేశామని తెలిపారు. మున్నూరు కాపులకు న్యాయం జరిగేంత వరకు పోరాటం కొనసాగిస్తామని హెచ్చరించారు. మున్నూరు కాపు చైతన్య యాత్రలో ప్రతి ఒక్కరు పాల్గొని కార్యక్రమాలను విజయవంతం చేయాలని మున్నూరు కాపు కుల బాంధవులకు పిలుపునిచ్చారు. ఈ సమావేశంలో మున్నూరు కాపు రాష్ట్ర అధ్యక్షులు కొత్త లక్ష్మణ్ పటేల్, మున్నూరు కాపు వికారాబాద్ ఇంచార్జ్ బజ్జు శ్రీధర్, తాండూరు ఇంచార్జ్ పట్లోళ్ళ నర్సిములు, తాండూరు పట్టణ అధ్యక్షుడు పట్లోళ్ళ బాల్ రెడ్డి,  రాష్ట్ర కార్య వర్గ సభ్యులు, జిల్లా కమిటి సభ్యులు, మున్నూరు కార్యవర్గ సభ్యులు రవీందర్, మహిపాల్, నరేష్, సాయన్న, చంద్రశేఖర్ తదితరులు పాల్గొంటారు.