నిషేధిత అంబర్ పట్టివేత

Published: Monday June 07, 2021

మంచిర్యాల టౌన్, జూన్ 06, ప్రజాపాలన : గుట్టా రవాణా జరుగుతున్నదనే నమ్మదగిన సమాచారం పై ఎ.సి.పి., మంచిర్యాల ఉత్తర్వుల ప్రకారం, గూడెం చెక్ పోస్ట్ వద్ద లక్షెట్టిపేటసిఐ నారాయణ నాయక్,దండిపల్లి ఎసై శ్రీకాంత్ లు  సిబ్బందితో కలిసి వాహనాలను తనిఖీ చేయుచుండగా సమయం ఆందాద 16:30 గంటలకు అనుమానాస్పదంగా కనిపించిన స్విస్ట్ డిజైర్ వాహనం నెం. ఎపి16 బిఆర్ 6756 ను ఆపి తనిఖీ చేయగా అందులో ముగ్గురు వ్యక్తులు బచ్చల సురేశ్, తం:రాజయ్య,  కారు డ్రైవర్, వి: లింగాపూర్ గ్రామము, సుల్వ సురేష్, మేదరి పేట గ్రామము, ఎర్రం నరేశ్, జన్నారం లు ప్రభుత్వం నిషేధించిన రూ.2,10,000/- విలువ కలిగిన పొగాకు ఉత్పత్తులు అనగా 6 అంబర్ ప్యాకెట్ బస్తాలు, ఒక్కక్క బస్తాలో 100 ప్యాకెట్ల చొప్పున 600 ప్యాకెట్లను గుర్తించడం జరిగింది. నిందుతులపై కేసు నమోదు చేసి కారుతో పాటు, అంబర్ ప్యాకెట్లను స్వాధీన పరుచుకొని, నిందితులను కోర్టులో హాజరు పరచడం జరిగింది. నిందితుల నేర చరిత్రను పరిశీలించి వారిపై అవసరమైతే పి.డి.యాక్టు ప్రకారం చర్యలు తీసుకో నున్నట్లు సిఐ పేర్కొన్నారు. ఎవరైనా చట్ట వ్యతిరేక చర్యలకు పాల్పడితే వారిపై కఠినమైన చర్యలు తీసుకో బడును. పోలిస్ మీ కోసం ఉన్నదని మరిచి పోవద్దు. ప్రతి పౌరుని రక్షణ మా బాధ్యత, అని తెలిపారు.