దుర్మార్గపు చర్యలకు పాల్పడే ఎంతటి వారినైనా శిక్షించాలి సీఎల్పీ నేత, మధిర శాసనసభ్యులు మల్లు

Published: Saturday October 08, 2022
బోనకల్, అక్టోబర్ 7 ప్రజా పాలన ప్రతినిధి: రాజకీయ కక్షల కోసం పంటలను పీకటం, మూగ జీవాలను ఇబ్బంది పెట్టడం, ఆటోలను తగలబెట్టమంటం చేష్టలు మంచి పరిణామం కాదని మధిర శాసనసభ్యులు మల్లు భట్టి విక్రమార్క అభిప్రాయపడ్డారు. మండల పరిధిలోని రాపల్లి గ్రామంలో బోలం రమణ అనే రైతుకు సంబంధించిన మిరప తోటను తమ పార్టీ నుండి వేరే పార్టీకి మారారు అన్న కక్షతో వేసిన పంటలు పీకి వెయ్యగా శుక్రవారం ఆయన పరిశీలించారు. ఈ సందర్భంగా బట్టి మాట్లాడుతూ రాజకీయ కారణాల వల్ల పంటలను నాశనం చేయడం, కుటుంబం గడవడానికి ఆదాయం కల్పించే ఆటోలను తగలబడటం ఇటువంటి దుర్మార్గపు చేష్టలు సరైనవి కావున్నారు. రాజకీయంగా ఎదురుకోవడానికి సిద్ధపడి ఉండాలే తప్ప వ్యక్తిగతంగా నష్టం కలిగించడం ప్రజాశ్రేషయకు మంచిది కాదన్నారు. ఇటువంటి దుర్మార్గపు చర్యలకు పాల్పడిన ఎంతటి వారైనా సరే చట్టపరంగా కఠినంగా శిక్షించాలని బోనకల్ ఎస్సై ను ఆదేశించారు. ఆరు నెలల క్రితం దుండగులు ఆటో తగలబెట్టిన కేసు విషయం గురించి వాకబుచేస్తూ వీలైనంత త్వరలో అరాచకానికి పాల్పడిన నిందితులను పట్టుకోవాలని సూచించారు. రాపల్లి గ్రామంలో వరుసగా జరుగుతున్న పరిణామాలను చూస్తే రాజకీయంగా ఎదురుకోలేని కొందరు ఇటువంటి దుర్మార్గాలకు పాల్పడుతునారన్నారు. గ్రామంలోని ప్రజలు విన్నవించిన సమస్యల గురించి త్వరలో మరలా పర్యటించి సమస్యల పరిష్కార దిశగా అడుగులేస్తామని ఆయన తెలియజేశారు. ఈ కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు తోట రామాంజనేయులు, తోట చలపతిరావు, ఎస్సై తేజావత్ కవిత, గ్రామ రైతులు, రాపల్లి ప్రజలు పాల్గొన్నారు.
 
 
 
Attachments area