కొండాపూర్ డివిజన్ లో అక్రమ నిర్మాణాలకు రాజకీయ నాయకుల అండదండలు

Published: Wednesday March 16, 2022
ప్రజాపాలన -న్యూస్ /శేరిలింగంపల్లి: నియోజకవర్గంలో అక్రమ నిర్మాణాలకు అడ్డూ అదుపూ లేకుండా పోయింది కొండాపూర్ డివిజన్ శ్రీ రామ్ నగర్ ఏ బ్లాక్ లో ఏకంగా 50 -70గజాల లో నాలుగు ఫ్లోర్ లు వేస్తున్న చూసిచూడనట్లు వ్యవహరిస్తున్న జిహెచ్ఎంసి అధికారులు అధికారుల దృష్టికి తీసుకువెళ్ళిన ఫలితం లేక పోతుంది ఎందుకంటే ఆ కాలనీ నాయకులు కొందరు నిర్మాణమునకు సహకరిస్తున్నారని ప్రజలు గుసగుసలాడుతున్నారు కొండాపూర్ ఏరియా హాస్పిటల్ గల్లీలో గల 70 గజాల లో నిర్మాణం చేపడుతున్న జిహెచ్ఎంసి అధికారులు చర్యలు చేపట్టారు నిర్మాణాన్ని అడ్డుకున్నారు తర్వాత మళ్లీ సదరు నిర్మాణ దారుడు కట్టడం నిర్మిస్తూ నాలుగు ఫ్లోర్ లు వేయటం జరుగుతుంది ఇది గమనించిన స్థానిక ప్రజలు జిహెచ్ఎంసి లో కంప్లైంట్ ఇవ్వడం జరిగింది కంప్లైంట్ తీసుకున్న జిహెచ్ఎంసి ఉన్నత అధికారులు అది ఆపే అందుకు బిల్డింగ్ దగ్గరకు చేరుకున్నారు ఇంతలో కొండాపూర్ కంటెస్టెంట్స్ కార్పొరేటర్ రాజకీయ నాయకులు కొందరు బిల్లింగ్ ను కొట్టకుండా ఆపివేశారనీ ప్రజలు మాట్లాడుకుంటున్నారు ఎన్ని లక్షలు చేతులు మారాయి అందుకే 70 గజాల లో నిర్మాణానికి ఎలా పరిమిషన్ ఇస్తున్నారని స్థానిక ప్రజలు ఆడుతున్నారు ప్రతినిత్యం వాహనాలతో రద్దీగా ఉండే ఆ రహదారికి సదరు నిర్మాణ దారుడు పార్కింగ్ సదుపాయం లేకుండా కమర్షియల్ గా నిర్మించడం పై గుసగుసలాడుతున్నారు జిహెచ్ఎంసి అధికారుల చేతివాటం చూపిస్తున్నారని స్థానికులు అనుకుంటున్నారు శ్రీరామ్నగర్ బి బ్లాక్ లో గల ప్లాట్ నెంబర్ 175 లో గల అక్రమ నిర్మాణాన్ని అడ్డుకోవటానికి 2 నెలల క్రితం కంప్లైంట్ ఇచ్చిన ఫలితం లేకపోయింది సదరు నిర్మాణదారులు బిల్డింగు పని పూర్తి కా వచ్చిన అధికారులు మాత్రం చోద్యం చూస్తున్నారు ఇకనైనా అక్రమ నిర్మాణాలపై కొరడా చూపించలని స్థానిక ప్రజలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు కంప్లైంట్ ఇచ్చి రెండు నెలలు అయినా జిహెచ్ఎంసి అధికారులు ఆ వైపు కూడా వెళ్లలేదా అంటే అధికారుల చేతివాటం ఎంతగా ఉందో దీన్ని బట్టి తెలుస్తుంది ఇకపై అనుమతులు లేని బహుళ అంతస్తుల నిర్మాణాల ను ఫేక్ చూపించకుండా కఠిన చర్యలు తీసుకోవాలని స్థానిక ప్రజలు కోరుతున్నారు