బోనకల్ గ్రామంలోని అంబేద్కర్ యూత్ ఆధ్వర్యంలో గణతంత్ర దినోత్సవ వేడుకలు

Published: Thursday January 27, 2022
బోనకల్, జనవరి 26 ప్రజాపాలన ప్రతినిధి: మండల కేంద్రంలో ఎం ఎస్ పి స్వేరో నెట్వర్క్ సారథ్యంలో 73వ గణతంత్ర దినోత్సవ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా ఎస్సై కవిత బాబాసాహెబ్ అంబేద్కర్ చిత్రపటానికి పూలమాలవేసి నివాళులర్పించి జెండా ఎగరవేయడం జరిగింది. ఈ సందర్భంగా ఎస్ ఐ మాట్లాడుతూ ఈ దేశానికి స్వతంత్రం రావడం ఒక ఎత్తయితే దేశానికి అతిపెద్ద లిఖితపూర్వక రాజ్యాంగం అందించడం ఒక బాబా సాహెబ్ అంబేద్కర్ కి మాత్రమే దక్కిందని, అదేవిధంగా భారతదేశం లో అన్ని రంగాల్లో అందరితో పాటు మహిళలకు రిజర్వేషన్ల ద్వారా మహిళలకు ప్రత్యేకమైన స్థానాన్ని కల్పించిన మహోన్నత వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ కొనియాడారు. స్వేరో జిల్లా అధ్యక్షులు జగదీష్ మాట్లాడుతూ సమాజంలో ప్రశ్నించే హక్కు మనిషిగా గుర్తించడానికి కావలసినటువంటి ముఖ్యమైన ఓటు హక్కును ప్రతి వ్యక్తికి కల్పించిన మహానుభావుడు డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ అని కొనియాడారు. ఈ కార్యక్రమంలొ సభాధ్యక్షులు అంతోటి శివ కృష్ణ, మంద అశోక్, వార్డు మెంబర్లు ఉప్పర శ్రీను, అంతోటి జై కుమారి, అంతోటి మాణిక్యమ్మ, ఆర్మీ అధికారులు అంతోటి తిరుపతిరావు, తోటపల్లి పోతయ్య, మంద మధు, తాటికొండ వెంకటరత్నం, అన్నేపాక స్వామి, అంబేద్కర్ యూత్ అంతోటి రవిప్రసాద్, మంద బాలకృష్ణ అంతోటి వెంకటేశ్వర్లు ఉప్రర గోపి, తాటికొండ ప్రసాద్, వేటూరి అచ్యుత్, నిమ్మకాయల లక్ష్మణ్, మందా వినోద్, బి ఎస్ పి నాయకుడు దారేల్లి రమేష్ మరియు గ్రామ ప్రజలు పాల్గొన్నారు.